చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం, అనుబంధ రంగాలను పెద్దఎత్తున ప్రోత్సహించారు.

 *చిత్తూరు నియోజకవర్గం, కృష్ణాపురంలో రైతులతో 

చిత్తూరు (ప్రజా అమరావతి);

*ముఖాముఖిలో నారా లోకేష్ ప్రసంగం....*

చంద్రబాబు రైతు కుటుంబం నుండి వచ్చారు. మా తాతగారు బెల్లం పంట పండించి నా తండ్రిని విద్యారంగం, ఇతర రంగాల్లో ప్రోత్సహించారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉంది. నిరంతరం రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తారు.

ప్రతి క్యాబినెట్ మీటింగులోనూ అప్పటి వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డితే లోతుగా సమీక్షించేవారు. నేటికాలంలో వ్యవసాయం లాభసాటిగా లేకుండాపోయింది.

ప్రపంచంలో సోయా, మొక్కజొన్నకు విపరీతంగా సబ్సిడీ ఇస్తారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వ్యవసాయం, అనుబంధ రంగాలను పెద్దఎత్తున ప్రోత్సహించారు.


చిత్తూరుజిల్లాలో పాడి, గోదావరిలో ఆక్వా, ఇతర జిల్లాల్లో పట్టుపురుగుల రంగాన్ని ప్రోత్సహిస్తూ, కాపాడుతూ వచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి 2019ఎన్నికల్లో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు.

అధికారంలోకి వచ్చాక మోటార్లకు మీటర్లు పెట్టి అత్యధికంగా రాయలసీమ రైతుల మెడకు ఉరితాళ్లు బిగించబోతున్నాడు.

పాడిపరిశ్రమకు ఆవులకు మేత కూడా చంద్రబాబు అందించి ప్రోత్సహించారు.

డ్రిప్ ఇరిగేషన్ ను చంపేశారు..

ఏపీలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది.

హంద్రీనీవా పనులు కూడా వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది. రాయలసీమకు నీళ్లు లేవు.

ప్రతి సంవత్సరం గిట్టుబాటు ధరకోసం రూ.3,500కోట్లు కేటాయిస్తామని జగన్ చెప్పారు. మాట తప్పారు.

కోల్డేజ్ స్టోరేజీలు, టమోటా కిచప్ ఫ్యాక్టరీలేవీ జగన్ తీసుకురాలేదు.

అబద్దాలు చెప్పడానికి జగన్ రెడ్డి పాదయాత్ర చేశారా అనే అనుమానం కలుగుతోంది.

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జనం మధ్యలోకి రాలేని వ్యక్తి పాదయాత్ర ఏ విధంగా చేశాడు? అదంతా డూప్ పాదయాత్రేనా జగన్?

చెరకు రైతులను జగన్ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. కోపరేటివ్ ఫ్యాక్టరీలన్నింటినీ దోచేయడానికి జగన్ కుట్ర చేస్తున్నాడు. అందుకే మూసేస్తున్నాడు.

దాదాపు 6ఫ్యాక్టరీల్లో జగన్ 5 మూసేశారు.

బెల్లం తయారీ రంగాన్ని చంద్రబాబు ప్రోత్సహించారు. కానీ నేడు బెల్లం రైతులను ప్రభుత్వం వేధింస్తోంది.

దుర్గారావు, శంకర్ అనే బెల్లం రైతులు పోలీసుల వేధింపులు తట్టుకోలేక చనిపోయాడు.

ఇలాంటివి చంద్రబాబు ఉండగా ఎన్నడూ జరగలేదు.

దేశంలో ఏపీ రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉంది.

బయో ప్రొడక్ట్స్ తయారు చేస్తేనే చెరకు రైతు బ్రతికే పరిస్థితి ఉంది.

మనం అధికారంలోకి వచ్చాక ఇవన్నీ చేస్తామని హామీ ఇస్తున్నాం.

మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారు. మేం అధికారంలోకి వచ్చాక ఆదుకుంటాం. గిట్టుబాటు ధరపై రూ.2 అదనంగా కల్పిస్తాం.

కోల్డేజ్ స్టోరేజీలను కూడా ఏర్పాటు చేస్తాం. గతంలోనూ కొన్ని చంద్రబాబు కట్టించారు.

పంటబీమాను వైసీపీ ప్రభుత్వం అందించడం లేదు.

చంద్రబాబు రైతులకు పంట నష్టపరిహారాన్ని పెంచారు. వైసీపీ వచ్చాక కనీసం అమలు చేయడం లేదు.

అన్నదాత-సుఖీభవ కార్యక్రమాన్ని వైసీపీ చంపేసింది..

పారదర్శక విధానంలో నష్టపరిహారాన్ని రైతులకు అందించాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ చేతకాని తనం వల్లనే పంట నష్టపరిహారం రైతులకు అందడం లేదు.

జగన్ కు వ్యవసాయంపై ఏమాత్రం అనుభవం లేదు...

కనీసం వ్యవసాయశాఖ మంత్రికి కూడా అనుభవం లేదు...ఇతనొక కోర్టు దొంగ. కోర్టులోని ఫైళ్లను ఈ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దొంగతనం చేశారు.

ఏపీ వ్యవసాయశాఖ మంత్రిని సీబీఐ విచారణకు రావాలని పిలుస్తోంది. అతను ఆ హడావుడిలో ఉన్నాడు. ఇతను రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు.

ఇన్ పుట్ సబ్సిడీ నుండి పంటకు గిట్టుబాటు ధర కల్పించే వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కానీ చేయడం లేదు. అందుకే వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది.

గ్రీన్ హౌస్ లను మనం అధికారంలోకి తీసుకొస్తాం.

రైతులకు సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్ లను ఇస్తాం...పంటను కాపాడతాం.

మేం ఇచ్చిన ప్రతి హామీకి మేం కట్టుబడి ఉన్నాం...చెప్పింది చేస్తాం.

దొంగ మరోసారి మీ వద్దకు వస్తాడు...నెత్తిమీద చేతులు పెడతాడు. ముద్దులు పెడతాడు. వాడి మాయలో పడ్డారా మీ సంగతి అంతే.....

Comments