ఉద్యోగుల ముఖ ఆధారిత నమోదు, హాజరు వంద శాతం వుండాలి
ముఖ ఆధారిత యాప్ లో సంబంధిత శాఖల సిబ్బంది నమోదు హాజరు డిడిఓలు పర్యవేక్షించాలి : కలెక్టర్*
పుట్టపర్తి, ఫిబ్రవరి22 (ప్రజా అమరావతి): ముఖ ఆధారిత హాజరు అమలులో భాగంగా ఎఫ్. ఆర్. ఎస్. యాప్ లో నమోదు కాకుండా ఇంకనూ మిగిలి ఉన్న ఉద్యోగులు అందరూ సత్వరమే ఎఫ్ఆర్ఎస్ యాప్ లో నమోదు చేసుకోవాలని దాని కొరకు సంబంధిత డి డి ఓ లు తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ ఆదేశించారు.
బుధవారం ఉదయం తాడేపల్లి నుండి కార్యదర్శి ముత్యాల రాజు వారు సి ఎఫ్ ఎం ఎస్ అధికారి సునీల్ రెడ్డి తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ ఆధారిత హాజరుపై వర్చువల్ విధానంలో సమీక్షించగా స్థానిక కలెక్టరేట్లోని స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ బసంత కుమార్, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్, డిఆర్ఓ కొండయ్య, సంబంధిత జిల్లా అధికారులతో హాజరయ్యారు.
విసి అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ చాలా శాఖలు యాప్ లో ఇప్పటికే నమోదు పూర్తి చేసారని, ఎక్కువ సిబ్బంది ఉన్న శాఖలు జిల్లా పంచాయితీ అధికారి, పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్, మునిసిపల్ శాఖ, అటవీ శాఖ, రెవెన్యూ తదితర శాఖలు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలని సూచించారు. ముఖ ఆధారిత హాజరు యాప్ నందు నమోదు మరియు హాజరు 80 శాతం శాఖలలో పూర్తి అయిందని, దానిని వంద శాతం తప్పక అమలు చేయాలి అని డిడిఓ లు దీనిని పర్యవేక్షించాలని అన్నారు. సిబ్బంది అందరూ ఉదయం సాయంత్రం ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలని తెలిపారు. క్యాంపు లో వెళ్ళిన అధికారులు, ఆన్ డ్యూటీ లో ఇతర ప్రాంతంలో ఉన్న అధికారులు యాప్ లో ఉన్న నియమాల మేరకు తప్పక హాజరు వేయాలని సూచించారు. ఏదైనా సాంకేతిక సమస్యలు, సందేహాలు ఉంటే ఎన్.ఐ.సి. వారిని సంప్రదించాలని అన్నారు.
ఈ సమీక్షలో జిల్లా అధికారులు డి ఆర్ డి ఎ పిడి నరసయ్య, డి పి ఓ విజయ్ కుమార్, జిల్లా పథక సంచాలకులు డ్వామా రామాంజనేయులు ,ఎస్ ఈ ఆర్ డబ్లు రషీద్ , వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment