సమన్వయంతో పనిచేసి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకోవాలి

 *సమన్వయంతో పనిచేసి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకోవాలి*


*:  జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఫిబ్రవరి 14 (ప్రజా అమరావతి):


అధికారులంతా సమన్వయంతో పనిచేసి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకునేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ పేర్కొన్నారు.


మంగళవారం అనంతపురం నగరంలోని బళ్లారి రోడ్డునందలి ఎంవైఆర్ ఫంక్షన్ హాలులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన మరియు స్పందన కార్యక్రమంపై జిల్లా స్థాయి ఓరియెంటేషన్ మరియు సమీక్ష సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి జి.విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, గ్రామ వార్డు సచివాలయాల అడిషనల్ డైరెక్టర్ భావన వశిష్ట, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి అడిషనల్ కమిషనర్ మహేశ్ కుమార్, హెల్త్ డైరెక్టర్ రామిరెడ్డి, అనంతపురము కలెక్టర్ కేతన్ గార్గ్ (ఎఫ్.ఏ.సీ), శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ మాట్లాడుతూ అధికారుల పనితీరు అంతా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై ఉండేలా నిర్ణయించడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు 17 రకాల స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో 8 రకాల ఇండికేటర్లను ప్రాధాన్యత పరంగా ఎంపిక చేసి వాటి లక్ష్యాలను చేరుకునేలా చూడాలని ఆదేశించారన్నారు. ఎంపిక చేసిన 8 రకాల ఇండికేటర్లలో 3 లక్ష్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ ఏడాది వాటి లక్ష్యాలను చేరుకోవాలని, వాటిలో స్కూల్ ఎడ్యుకేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ లక్ష్యాలపై పూర్తిస్థాయిలో దృష్టి సాధించారని ఆదేశించడం జరిగిందన్నారు. ఆయా లక్ష్యాలను చేరుకోవడంలో పనితీరు ఎంత ఎక్కువగా ఉంటే అంత రాష్ట్ర ర్యాంకు ఉన్నతంగా ఉంటుందని, లక్ష్యాలను చేరుకోవడంలో పనితీరు ఎంత తక్కువగా ఉంటే రాష్ట్ర ర్యాంకు అంత తక్కువగా ఉంటుందన్నారు. ఆరు నెలలుగా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో పురోగతిపై జిల్లా స్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు ప్రతివారం మానిటర్ చేస్తున్నారని, ఇండికేటర్లలో అభివృద్ధి దిశగా, లక్ష్యం చేరుకునే దిశగా గైడ్ చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై ఓరియంటెషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లక్ష్యాల సాధనలో జిల్లా ప్రగతి ఏ విధంగా ఉంది అనే దానిపై సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. లక్ష్యాల సాధనకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, వాటిని చేరుకోవడం కోసం అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు.



Comments