వార్డు వాలెంటీర్ల , కన్వినర్ల మరియు గృహసారధుల ప్రత్యేక సమావేశం

 *వార్డు వాలెంటీర్ల , కన్వినర్ల మరియు గృహసారధుల ప్రత్యేక సమావేశం*


బొబ్బిలి, ఫిబ్రవరి 11 (ప్రజా అమరావతి):-

బొబ్బిలి శాసనసభ్యులు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆధ్వర్యంలో, బొబ్బిలి టౌన్ జె సి ఎస్ కన్వీనర్ రేజేటి ఈశ్వర్రావు( విస్సు)అధ్యక్షతన, బొబ్బిలి పార్టీ కార్యాలయంలో వార్డు వాలెంటీర్లు, సచివాలయం కన్వినర్లు మరియు గృహ సారధులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు శంబంగి మాట్లాడుతూ, వాలంటీర్లను, సచివాలయ వ్యవస్థను సమన్వపరుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా గృహ సారధులను, సచివాలయం కన్వినర్లను నియమించడం జరిగిందని తెలియజేశారు.వీరు ప్రతి గృహానికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలపై లబ్ధిదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని,ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేటట్లు జాగ్రత్త తీసుకోవాలని తెలియజేశారు.గృహ సారధులకు ఒక ప్రత్యేకమైన కిట్టు ఇవ్వటం జరుగుతుందని, దానిని ఉపయోగించుకుంటూ ప్రభుత్వానికి మరింత చేదోడువాదులుగా ఉండాలని పిలుపునిచ్చారు.ముఖ్యఅతిథి జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) మాట్లాడుతూ,ప్రభుత్వ పథకాలను మరింత పారదర్శకంగా ప్రజలకు అందించాలి అనే ఉద్దేశంతో సచివాలయాల కన్వీనర్లను, గృహసారధులను నియమించడం జరిగిందని తెలిపారు..అందరూ సమన్వయంగా పనిచేస్తూ, మరలా వచ్చే ఎన్నికల్లో బొబ్బిలిలో వైసీపీ జెండా ఎగరడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.పరోక్షంగా తెలుగుదేశం నాయకులు పైన, అదే విధంగా బొబ్బిలి రాజుల పైన కొన్ని విమర్శలు చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే నాయకత్వంలో బొబ్బిలిలో ఎంతో అభివృద్ధి జరుగుతుందని, గత 15 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు.పార్టీలకు కొన్ని అంతర్గత సమస్యల గురించి మాట్లాడుతూ, పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ కలిసికట్టుగా ముందుకు పోవాలని విజ్ఞప్తి చేశారు.పార్టీకి చెడ్డ పేరు తేవాలని ఎవరైనా చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఏవైనా సమస్యలు ఉంటే పెద్దలు వద్ద కూర్చొని పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శంబంగి వేణుగోపాల్ నాయుడు, టౌన్ వైసీపీ ప్రెసిడెంట్ ఇంటి గోపాలరావు,మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళి కృష్ణారావు,టౌన్ సచివాలయాల కన్వీనర్ రేజేటి ఈశ్వరరావు(విస్సు), వైసీపీ నాయకులు బొద్దల సత్యనారాయణ,మున్సిపల్ వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, వార్డు వాలంటీర్లు, వార్డు కన్వీనర్లు,గృహసారధులు, వైసిపి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..


 

Comments