కేజిబివి ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసుకొని రెగ్యులర్ చేయాలి,

 విజయవాడ (ప్రజా అమరావతి);


కేజిబివి ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసుకొని రెగ్యులర్ చేయాలి,


తక్షణమే మినిమం ఆఫ్ టైం స్కేల్ అమలు చేయాలి.- విటపు.బాలసుబ్రమణ్యం, ఎమ్మెల్సీ,పిడిఎఫ్ ఫోర్ లీడర్ కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం 23% వేతనాలు పెంచడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో కేజీబీవి టీచర్స్ ప్రిన్సిపల్స్  రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సమావేశంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీలు విటపు.బాలసుబ్రమణ్యం, అతిథిగా  పాల్గొన్నారు. జీవో నెంబర్ 40, 5 ప్రకారం మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని చెప్పినప్పటికీ, కేవలం 23% వేతనాలు పెంచడం దుర్మార్గమని రాష్ట్ర ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు. పిఆర్సి ప్రకటన సందర్భంగా ఎం.టి.ఎస్ పై స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, శాసనమండలి విద్యాశాఖ మంత్రి లిఖితపూర్వకమైన సమాధానం ఇవ్వడం జరిగింది వీటన్నిటికీ విభిన్నంగా 23% వేతనాలు పెంచి ఉద్యోగులను మోసం చేయడం తగదని ఎమ్మెల్సీ అన్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయం పైన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు. మరోవైపు కేజీబీవి ఉద్యోగుల రెగ్యులర్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం తగదని అన్నారు. తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 

ఎపి స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసి రాష్ట్ర చైర్మన్ ఎవి నాగేశవరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కోసం స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలని, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ఎస్.టి.యు అసోసియేట్ కార్యదర్శి రామచంద్ర రావు, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ కుమార్ పాల్గొని మద్దతునీ తెలిపారు.

 ఈ సమావేశంలో వివిధ జిల్లాలో కేజీబీవీ టీచర్స్, ప్రిన్సిపల్ సంఘాల నాయకులు సౌభాగ్యలక్ష్మి, సునీత, లలిత, సుమలత, నాగరత్నం, మమత జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బాలకాశి. ఉపాధ్యక్షుడు కే.విజయ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాంతారావు పాల్గొన్నారు.


నూతన కమిటీ ఎన్నిక.


కేజిబివి ప్రిన్సిపాల్, టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక జరిగింది.. రాష్ట్ర అధ్యక్షురాలు గా సౌభాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమలత, ట్రెజర్ గా భారతి ఎన్నిక అయ్యారు. నూతన కమిటీ సభ్యులుగా మమత, అంజిబాయి, నాగరత్నం, రూప, సౌభాగ్యవతి, సునీత,బి. మహేశ్వరి, సునీత కుమారి, బ్రహ్మీణి, పుష్పలత, సంధ్య, లలిత, రుక్మణీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Comments