*జిల్లాకు నాలుగు 104 సంచార వైద్యశాలలు
*
*: జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మార్చి 27 (ప్రజా అమరావతి):
జిల్లాకు నూతనంగా నాలుగు సంచార వైద్యశాలలు (104) మంజూరు కాగా, సంచార వైద్యశాలలను జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ ప్రారంభించారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో నూతన సంచార వైద్యశాలలను పచ్చజెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంచార వైద్యశాలల ద్వారా మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. డిఎంహెచ్ఓ డా.కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేటాయించిన నాలుగు సంచార వైద్యశాలల్లో మడకశిర, గోరంట్ల, ముదిగుబ్బ మండలాలకు ఒక్కొక్కటి కేటాయించడం జరిగిందని, మిగిలిన వాహనం బ్యాక్అప్ గా ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 104 జిల్లా నోడల్ ఆఫీసర్ సెల్వియా, జిల్లా మేనేజర్ శంకర్, ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్స్ రామకృష్ణ, ఆదినారాయణ, జుబీర్, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment