జిఐఎస్ లో రూ.21,941 కోట్ల పర్యాటక పెట్టుబడులు 41,412 మందికి ఉద్యోగ అవకాశాలు

 *జిఐఎస్ లో రూ.21,941 కోట్ల పర్యాటక పెట్టుబడులు 41,412 మందికి ఉద్యోగ అవకాశాలు


*

*•రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇమేజే ఇందుకు ప్రధాన కారణం*

*•ఏడాది కాలంలో ఈ ప్రాజక్టులు అన్నీ గ్రౌండ్ అయ్యేలా  చూసేందుకు  రెండు కమిటీలు ఏర్పాటు*

*రాష్ట్ర పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా*

                                                                           * * *

అమరావతి, మార్చి 7 (ప్రజా అమరావతి):  ఈ నెల 3, 4  తేదీల్లో  విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో   రాష్ట్ర పర్యాటక రంగానికి సంబందించి రూ.21,941 కోట్ల పెట్టుబడులతో 129 ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 41,412 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని  రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యూత్ అడ్వాన్సుమెంట్ & సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్.కె.రోజా తెలిపారు.  ఈ మద్యే ఉత్తర ప్రదేశ్, పంజాబ్,  రాజస్తాన్, కర్ణాటకల్లో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో కూడా పర్యాటక రంగానికి  సంబందించి ఇంత  భారీ స్థాయిలో పెట్టుబడులు రాలేదని ఆమె అన్నారు.  రాష్ట్ర పర్యాటక  రంగంలో  ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు  వచ్చేందుకు  రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఇమేజే ప్రధాన  కారణమని ఆమె తెలిపారు. 

                                                                                                                                                      మంగళవారం వెలగపూడిలోని ఆంద్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్లోని పబ్లిసిటీ సెల్ లో ఆమె  పాత్రికేయులతో మాట్లాడుతూ  విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఎంతో విజయవంతం అయిందంటూ  కేక్ ను  కట్ చేసి ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.   గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు  ఈ సదస్సుకు  హాజరవ్వడమే కాకుండా రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులతో భారీఎత్తున ఒప్పందాలు జరిగాయని తద్వారా 6.09 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నట్లు ఆమె తెలిపారు.  ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అయిన అంబానీ, అధానీ, దాల్మియా, ఒబెరాయ్, జిఎంఆర్ వంటి అతిరథ మహారధులు ఈ సదస్సుకు హాజరవ్వడం జరిగిందన్నారు.  రాష్ట్రంలోని పారిశ్రామిక అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని  వారు ఎంతో గొప్పగా చెప్పడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో పాటు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్దిలో మేమూ పాలు పంచుకుంటామని   వారంతా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

                                                                                                                                                                                      రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  సమర్థవంతమైన పాలన అందజేస్తున్న ఫలితంగా రాష్ట్ర జి.ఎస్.డి.పి. గ్రోత్ 2022 లో 11.43 శాతం రావడమే కాకుండా ఈజ్ ఆఫ్ డూయింట్ బిజినెస్ గత మూడేళ్ల నుండి ప్రథమ స్థానంలో నిలవడం, ఎగుమతుల్లో నాల్గో స్థానంలో, రెలిజియస్  టూరిజంలో ప్రధమ స్థానంలోను, జనరల్ టూరిజంలో  మూడవ స్థానంలోను నిలవడం జరిగిందన్నారు. ఇటు వంటి  సమర్థవంతమైన పాలన అందజేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  పై పూర్తి నమ్మకం, విశ్వాసంతోనే  పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి తరలి రావడం జరిగిందన్నారు.  

                                                                                                                                                                                  రాష్ట్ర పర్యాటక రంగానికి సంబందించి రూ.21,941 కోట్ల పెట్టుబడులతో  జరిగిన మొత్తం 129 ఒప్పందాలను సాద్యమైనంత త్వరగా అమలు పర్చి ఏడాది  కాలంలోనే వాటన్నింటినీ గ్రౌండ్ అయ్యేలా చూసేందుకు  కార్యాచరణ ప్రణాళికను  ఇప్పటికే రూపొందించుకోవడమే కాకుండా  పర్యాటక శాఖ పరంగా  పర్యాట శాఖ స్పెషల్ సి.ఎస్. మరియు  ఏపి టూరిజం డెవలెమ్మెంట్  కార్పొరేషన్  ఎం.డి. స్థాయిల్లో రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడమే కాకుండా,  పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత నిస్తూ ఉత్తమ పర్యాటక విధానాన్ని రూపొందించి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను కూడా అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఫలితంగా  రాష్ట్ర పర్యాటక రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు  రావడం జరిగిందని ఆమె తెలిపారు. 

                                                                                                                                                                            పెట్టుబడుల సదస్సులో జరిగిన కొన్ని ముఖ్యమైన ఒప్పందాలను ఆమె వివరిస్తూ హాస్పిటాలిటీ అండ్ వెల్నెస్ రంగంలో ఒబెరాయ్  గ్రూప్ పిచుకలంక, గండికోట, విశాఖపట్నం, తిరుపతి, హార్సీలీహిల్స్ల్లో రూ.1,350 కోట్లు పెట్టుబడి పెట్టనుందని, ఈ ప్రాజెక్టు ద్వారా  1,090 మందికి ఉపాధి లభిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్  తూర్పుగోదావరి జిల్లాలో డెస్టినేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు.  హ్యవ్ లాక్ బ్రిడ్జి, కాకినాడ బీచ్  ప్రాంతాల్లో రూ.1,000 కోట్లతో డెస్టినేషన్ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ది చేయనున్నట్లు ఆమె తెలిపారు. దేవభూమి రోప్ వేస్ (డెహ్రడూన్) వారు విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, తిరుపతి, విశాఖపట్నంలో రూ.1,250 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్  కేబుల్ కార్ ప్రాజెక్టులు అభివృద్ది చేస్తున్నదని,  ఈ ప్రాజెక్టు ద్వారా 700 మంది ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ఆమె తెలిపారు. డ్రీమ్ వ్యాలీ గ్రూప్ విశాఖపట్నంలో రూ.1,000 కోట్లతో కేబుల్ కార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, ఈ ప్రాజెక్టు ద్వారా 6,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆమె తెలిపారు. తులి హోటల్స్ కంపెనీ మారేడుమిల్లి ప్రాంతంలో రూ.1,000 కోట్లతో  వేయి మందికి ఉపాధి లభించేలా సఫారీ టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నదన్నారు. ఎం.ఆర్.కే.ఆర్. కన్ స్ట్రక్షన్స్  అండ్ ఇండస్ట్రీస్ తిరుపతి, బాపట్ల, విశాఖపట్నంలో రూ.1,000 కోట్లతో  ఏడు స్టార్ హోటల్స్ కట్టేందుకు ముందుకు వచ్చిందని, ఈ మూడు ప్రాంతాల్లో దాదాపు వేయి మందికి తక్కువ కాకుండా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆమె తెలిపారు.  అదే విధంగా మంజీరా హోటల్స్ అండ్ ప్రాజెక్ట్సు సంస్థ  విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో  హోటళ్లను అభివృద్ది  పర్చేందుకు ఒప్పందం చేసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. 

                                                                                                                                                                                            ఈ సందర్బంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ స్పెషల్ సి.ఎస్. డా.రజత్ బార్గవ మాట్లాడుతూ రాష్ట్రంలో  పర్యాటక రంగం అభివృద్దికి  ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నివ్వడం జరుగుచున్నదని, అయితే  అదే స్థాయిలో  గ్లోబల్ ఇన్వెస్టుమెంట్ సమ్మిట్ లో  పర్యాటక రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ముందుకు రావడం జరిగిందని తెలిపారు.  దేశంలోనే ఉత్తమ  టూరిజం పాలసీగా మన  పర్యాటక పాలసీకే అవార్డు కూడా రావడం జరిగిందని తెలిపారు. దేశంలోని  జనరల్ టూరిజంలో  రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉందని,  ఆ స్థానాన్ని ప్రథమ స్థానంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర పర్యాటక శాఖ కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  

                                                                                                                                                                                                          ఈ సమావేశంలో  ఏపి టూరిజం డవెలెమ్మెంట్  కార్పొరేషన్  ఎం.డి. కె.కన్నబాబు, ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్  ఎ.ల్.మల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

                                                                                                                                                                                 

Comments