పట్టభద్రులకు సంబంధించి 63.82 శాతం, టీచర్లకు సంబంధించి 88.36 శాతం పోలింగ్ నమోదునెల్లూరు, మార్చి 13 (ప్రజా అమరావతి): 

ప్రకాశం,  నెల్లూరు,  చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం ఉదయం నెల్లూరు డీకే డబ్ల్యూ కళాశాలలో  పోలింగ్ స్టేషన్ ను కలెక్టర్ పరిశీలించి ఏర్పాట్లపై  ఓటర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు డివిజన్ లలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన పోలింగ్ లో పట్టభద్రులకు సంబంధించి 63.82 శాతం, టీచర్లకు సంబంధించి 88.36 శాతం పోలింగ్ నమోదై


నట్లు కలెక్టర్ చెప్పారు. జిల్లాలో  పి ఓ లు, ఏపీవోలు, మైక్రో అబ్జర్వర్లు, వెబ్ క్యాస్టర్లు, వీడియో గ్రాఫర్లు సుమారు 1750 మంది ఎన్నికల విధుల్లో పాల్గొని, పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారని పోలింగ్ సిబ్బందిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. 


తొలుత కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లాలో పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అనంతరం  డి కే డబ్ల్యూ కళాశాలలో కలెక్టర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

 సాయంత్రం నెల్లూరు డీకే డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామాగ్రి స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రిని జాగ్రత్తగా స్వాధీనం చేసుకుని గట్టి బందోబస్తు నడుమ చిత్తూరులోని కౌంటింగ్ కేంద్రాలకు తరలించనున్నట్లు చెప్పారు. 


కలెక్టర్ వెంట నెల్లూరు మున్సిపల్ కమిషనర్ శ్రీమతి హరిత, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ, ఆర్డిఓ మలోల, తాసిల్దారులు తదితరులు ఉన్నారు. 


Comments