నెల్లూరు, మార్చి 1 (ప్రజా అమరావతి);
జిల్లాలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల స్లిప్పుల పంపిణీ కార్యక్రమం ఈనెల 8వ తేదీలోగా పూర్తి
చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి తెలిపారు.
బుధవారం సాయంత్రం వెలగపూడి సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి వారి క్యాంపు కార్యాలయం నుండి పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో మొత్తం1,15,800 మంది ఓటర్లు ఉన్నారని, అందులో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 1,07,635 మంది ఓటర్లు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 8,165 మంది ఓటర్లు ఉన్నారన్నారు.
ఓటర్ల స్లిప్పులు ముద్రించడం జరిగిందని, వాటి పంపిణీ ఇప్పటికే మొదలుపెట్టామని ఈనెల 8 వ తేదీలోగా అన్ని ఓటర్ల స్లిప్పులు సంబంధిత ఓటర్లకు అందజేస్తామన్నారు.
పోలింగ్ సామాగ్రి , పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అన్ని సిద్ధం చేసుకుంటున్నామన్నారు.
పోలింగ్ విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు, ఏపీఓలకు గత ఫిబ్రవరి నెల 27వ తేదీన మొదటిసారి శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. మరలా వారికి ఈనెల 9 వ తేదీన రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. అలాగే సూక్ష్మ పరిశీలకులకు కూడా ఈనెల 6 వ తేదీన శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.
జిల్లాలో మొత్తం 169 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అందులో పట్టభద్రుల కోసం 129, ఉపాధ్యాయుల కోసం 40 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటిల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని , వెబ్ కాస్టింగ్ విధులు నిర్వహించేవారికి ఈనెల 8 వ తేదీన శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నిరంతరం సంప్రదిస్తున్నామని జిల్లాలోని నాలుగు డివిజన్లలో అవసరమైన అన్ని బ్యాలెట్ పెట్టెలు సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం పురోగతిలో ఉందని నెల్లూరు నగరం గ్రామీణ ప్రాంతాల మినహా మిగతా అన్నిచోట్ల పూర్తయిందన్నారు.
జిల్లాలో పోలింగ్ నిర్వహణకు 440 మంది పిఓలు ఎపిఓ లను నియమించడం జరిగిందని, వారికి ఫారం- 12 పోస్టల్ బ్యాలెట్లు అందజేసి ఈనెల 9 వ తేదీన వాటిని తిరిగి సేకరించడం జరుగుతుందన్నారు.
జిల్లా పోలీసు అధికారి శ్రీ సిహెచ్ విజయ రావు మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
జిల్లాలో 1300 మంది వివిధ ర్యాంకుల అధికారులు సిబ్బందిని ఎన్నికల విధులు కోసం నియమించామని, 49 ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని, 21 రూట్లలో సెక్టోరల్ మొబైల్ అధికారులను నియమించామని వివరించారు.
గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద తగినంత భద్రతా దళాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం గస్తీ చేస్తున్నాయన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లాలోని ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓటు హక్కు కలిగిన పిఓలు, ఏపీవో లకు తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్లు అందజేసి తిరిగి సేకరించాలన్నారు.
పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు వీలుగా పిఓ ఏపీవోలకు, సూక్ష్మ పరిశీలకులకు, వెబ్ క్యాస్టింగ్ సిబ్బందికి భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు.
పోలింగ్ సామాగ్రి సజావుగా పంపిణీ అయ్యేలాగా పక్కాగా పంపిణీ కేంద్రాలు ఏర్పాట్లు చేయాలన్నారు.
పోలింగ్ విధులకు హాజరయ్యే అధికారులు సిబ్బందికి కావలసిన భోజనము, మంచినీరు తదితర ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. పోలింగ్ రోజున గంటల వారి పోలింగ్ శాతం నివేదికలు ఎప్పటికప్పుడు సకాలంలో పంపాలన్నారు. బూతు స్థాయి అధికారుల నుండి డివిజనల్ సాయి అధికారుల వరకు అందరూ అందుబాటులో ఉండాలన్నారు.
కంట్రోల్ విభాగాలు,
వెబ్ కాస్టింగ్ పనితీరు సరిగా జరుగుతుందో లేదో పరిశీలించాలన్నారు.
వాకి టాకీల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.
టీవీలలో కూడా బ్రేకింగ్ వార్తలు గమనించాలని అవసరాన్ని బట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
సీఈవో ,పరిశీలకులు, రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి పోలింగ్ రోజున సంప్రదించినప్పుడు వెంటనే స్పందించాలన్నారు.
ఈనెల 13వ తేదీ పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పెట్టెలు, పోస్టల్ బ్యాలెట్ పెట్టెలు, అన్ని రకాల నివేదికలు తీసుకొని చిత్తూరు లో రిటర్నింగ్ అధికారికి అప్పగించాలన్నారు
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి సంయుక్త కలెక్టర్ శ్రీ రోణంకి కూర్మానాద్, ఎన్నికల ఏ ఆర్ ఓ -డిఆర్ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ, అదనపు ఎస్పీ శ్రీమతి హిమవతి, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీమతి ఎస్ ఎస్ శోభిక, నెల్లూరు, కావలి ఆర్డీవోలు శ్రీ ఏ మలోల, శ్రీ సీనా నాయక్, ఎన్నికల నోడల్ అధికారులు శ్రీ టీ బాపిరెడ్డి, శ్రీ ప్రేమ్ కుమార్, శ్రీ బి చిరంజీవి, శ్రీ వెంకట్రావు, శ్రీ శ్రీనివాసులు, శ్రీ సురేష్ కుమార్, శ్రీ చెన్నుడు తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment