కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే పేదల కష్టాలు తీరుతాయి : పాత్రికేయ సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు.

 కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే పేదల కష్టాలు తీరుతాయి : పాత్రికేయ సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు.మహబూబ్ నగర్ (ప్రజా అమరావతి): నేడు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు శ్రీ. జి. మధుసూధన్ రెడ్డి (GMR) గారి అధ్యక్షతన నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో గోవా పీసీసీ అధ్యక్షులు, తెలంగాణ హాత్ సే హాత్ జోడో యాత్ర ఇన్చార్జ్ శ్రీ. గిరిష్ చోడొంకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై పాత్రికేయుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు, కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను, రాహుల్ గాంధీ గారు సందేశాన్ని  గడపగడపకు చేరవేసేందుకు హాత్ సే హత్ జోడో యాత్ర తలపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ యాత్ర తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతుందని శ్రీ. గిరిష్ చోడొంకర్ గారు తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిందని తెలిపారు.


కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్విస్ బ్యాంకు లోని నల్లధనం తీసుకువచ్చి పేదల ఖాతాలో 15 లక్షలు రూపాయలు వేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు నల్లధనం ఊసేత్తడం లేదని తెలియజేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను బిజెపి మోసం చేసిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా అప్పులు చేసి ఖజానా దివాలా తీయించారని కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాల తీరుపై శ్రీ. గిరిష్ చొడొంకర్ గారు విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మా లక్ష్యం, నా కుటుంబానికి పదవులు వద్దని చెప్పిన కేసీఆర్ గారు, తెలంగాణ ఏర్పడ్డాక కొడుకుకు, కూతురుకు, అల్లుడికి, మేనల్లుడికి ఇలా అందరికీ పదవులు ఇచ్చి కుటుంబ పాలన కొనసాగిస్తూ U యూటర్న్ ముఖ్యమంత్రిగా నిలిచిపోయారని అభివర్ణించారు. హామీలు విస్మరించిన యూటర్న్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి కొనసాగే నైతిక హక్కు లేదని చోడొంకర్ గారు మండిపడ్డారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ. జి. మధుసూధన్ రెడ్డి (GMR) గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు తెలంగాణలో చేసిన అవినీతి చాలాదన్నట్లుగా ఎమ్మెల్సీ కవిత గారు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారన్నారు. టీఎస్‌పీఎస్సీలో పేపర్‌ లీక్‌ లో కుమారుడు కేటీఆర్ గారి అనుచరుల హస్తం ఉందని జిఎంఆర్ గారు ఆరోపించారు. తక్షణమే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జియంఆర్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు జగదీశ్వర్ రావు గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ గారు, సంజీవ్ ముదిరాజ్ గారు, కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ గారు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.Comments