సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తాం.
బీ.సీల ఓట్ల కోసమే అసెంబ్లీలో తీర్మానం.
రిజర్వేషన్ పరంగా ఎస్టీలకు అన్యాయమే జరుగుతుంది.
ఎస్టీ సంఘాల నాయకులు.
చిలకలూరిపేట (ప్రజా అమరావతి);వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిస్తున్నారు. దీనిని నిరసిస్తూ స్థానిక తాహసిల్దార్ కార్యాలయం వద్ద శనివారం మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్టి నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ మాదిరిగానే వైసిపి ప్రభుత్వం చేస్తుందని, ఏరాజకీయ పార్టీ అయినా తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఎస్టీలకు ఈ విధమైన అన్యాయం చేయడం చాలా దారుణమని నాయకులు ఆగ్రహ వ్యక్తం చేశారు. ప్రక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇటువంటి బిల్లులు తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపిస్తే తోసి బుచ్చారని, ఇదంతా బీసీలను మోసం చేయడం కోసమే కాకుండా వారి ఓట్ల కోసం ఈ విధమైనటువంటి నిర్ణయం సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారని నాయకులు ఉద్భవించారు. దీనిపై ప్రతి ఒక్క బీసీ సోదరుడు మేలుకొని పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసమే ఏకైక లక్ష్యంగా పని చేస్తామని ఎస్టీ నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. అనంతరం తాహసిల్దార్ జి. సుజాతకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్, ప్రధాన కార్యదర్శి కుంభ నాగేశ్వరరావు, పట్టణ గౌరవ అధ్యక్షులు బి. చిన్న నాయక్, అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు,మండల నాయకులు దేవరకొండ గోపికృష్ణ, కోశాధికారి బి. రాంబాబు నాయక్ విద్యార్థి కన్వీనర్ వి.వాగ్యనాయక్, సుగాలి వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బి. శ్రీను నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యూత్ అధ్యక్షులు జె. రాంబాబు నాయక్ జిల్లా కార్యదర్శి రామావతు బాలకృష్ణ నాయక్, బాలకోటి నాయక్, జరపల సీతారాం నాయక్, రామోజీ శెట్టి నాయక్ ,కె. నాగరాజు నాయక్ బి.శిరీషా భాయి తోపాటు ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు పాల్గొన్నారు.
addComments
Post a Comment