యువనేత లోకేష్‌ని కలిసిన కురుబ సామాజికవర్గీయులు
• రత్నాలపల్లిలో యువనేత లోకేష్ కి సమస్యలు విన్నవించిన కదిరి నియోజకవర్గ కురుబ సామాజికవర్గీయులు.
• వైసిపి ప్రభుత్వం కురుబ కార్పొరేషన్ కు ఎటువంటి నిధులు కేటాయించలేదు.
• గొర్రెల లోన్లు, సబ్సిడీ రుణాలు, గొర్రెలు, గొర్రెల పెంపకందారులకు భీమా సౌకర్యం కల్పించాలి.
• నూరుశాతం సబ్సిడీతో గొర్రెల పెంపకందార్ల షెడ్ల నిర్మాణానికి సహాయం అందించాలి.
• ప్రతి గ్రామంలో గొర్రెల మేపు కోసం 10ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలి.
• కురుబల కులదైవం భక్త కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహించాలి. జిల్లాకేంద్రంలో కమ్యూనిటీ హాలు భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి.
• కురుబ యువతీయువకులకు విద్య, స్వయం ఉపాధి రుణాలను అందించాలి.
• కురుబల కులవృత్తి అయిన కమ్మెళ్లనేత పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం రుణాలు మంజూరుచేయాలి.
• గొర్రెల కాపరుల సంఘాలు, కురుబ కమ్యూనిటీ హాళ్లకు విరివిగా నిధులు మంజూరు చేయాలి.
• ఉమ్మడి అనంతపురం జిల్లాలో జనాభాపరంగా రెండోస్థానంలో ఉన్న కురుబలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి పదవులు కేటాయించాలి.
కదిరి (ప్రజా అమరావతి);
నారా లోకేష్ స్పందిస్తూ...
• రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుర్చీల్లేని కార్పొరేషన్లను ఏర్పాటుచేసి బిసిలకు తీరని అన్యాయం చేశారు.
• గత ప్రభుత్వ హయాంలో బిసి కమ్యూనిటీ హాళ్లకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేయగా, ఈ ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హాళ్ల పనులను నిలిపివేసింది.
• నిలిచిపోయిన కమ్యూనిటీహాల్ భవనాలను అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిచేస్తాం.
• గొర్రెల కాపరులు, గొర్రెలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తాం.
• టిడిపి అధికారంలోకి వచ్చాక కురుబల గొర్రెల మేపు కోసం ఖాళీగా ఉన్న బంజరు భూములను కేటాయిస్తాం.
• కురుబ కార్పొరేషన్ ను బలోపేతం చేసి గొర్రెల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు అందిస్తాం.
• కురుబల ఆరాధ్యదైవం కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహిస్తాం. అనంతపురంలో కురుబ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి చర్యలు చేపడతాం.
• కురుబ యువతకు విద్య, స్వయం ఉపాధి రుణాలకు చర్యలు తీసుకుంటాం.
• బిసిలు, కురుబలకు అండగా నిలిచే చంద్రన్నను ముఖ్యమంత్రి చేసేందుకు మీ వంతు సహకారం అందించండి.
addComments
Post a Comment