రైతు సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


రైతు సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నద


ని, 10 ఎకరాల లోపు వున్న అక్వా రైతు లందరికి  రూ.1.50 పైసలకే సబ్సిడీ కింద విద్యుత్ ను  అందించే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. 

మంగళవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు  మండలం, కోడూరు-2 గ్రామ సచివాలయ పరిధిలోని  పాత కోడూరు  గ్రామంలో  40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ  నూతన భవనాన్ని, 5 లక్షలతో నిర్మించిన త్రాగునీటి శుద్ది కేంద్రాన్ని  మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ,   వివిధ పధకాల కింద వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు.

ఈ సంధర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో   అమలుచేస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా  తెలుసుకోవడంతో పాటు ఏదైనా సాంకేతిక కారణాల వలన సంక్షేమ పధకాలు అందక పోతే, సంబంధిత లబ్ధిదారునికి అందించడం జరుగుచున్నదన్నారు.  అలాగే గ్రామాల్లో దశాబ్దాల కాలం నుండి  దీర్గకాలంగా పెండింగ్లో ఉండి మిగిలి పోయిన సమస్యలను తెలుసుకొని  పరిష్కరించడం జరుగుచున్నదన్నారు.  ఈ పంచాయతీ పరిధిలో 37.15 కోట్ల  రూపాయలతో సిమెంటు రోడ్లను,  13.50 కోట్ల రూపాయలతో సైడు  కాలువల నిర్మాణాలు చేపట్టడంతో పాటు, 14 ఆర్.ఓ ప్లాంట్స్  మంజూరు చేయడం జరిగిందని మంత్రి వివరించారు.  జల్ జీవన్ మిషన్ పధకం కింద 8.82 కోట్ల రూపాయలతో చెరువుల పునర్నిర్మాణ పనులు  చేపట్టడం జరుగుచున్నదని  మంత్రి తెలిపారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లభించి  నేడు రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారన్నారు.  రెండో పంటకు కూడా సాగు నీరు అందిస్తామని మంత్రి తెలిపారు.  10 ఎకరాల లోపు వున్న అక్వా రైతు లందరికి  రూ.1.50 పైసలకే  సబ్సిడీ కింద విద్యుత్ ను  అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాల్లో  ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సంపూర్ణంగా,  సమగ్రంగా  పూర్తిచేయడంతో పాటు,  గ్రామాల అభివృద్ది, ప్రజల సంక్షేమమే  ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

Comments