ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


జిల్లాలో ఈ నెల 13వ తేదీన   జరగనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాల


ని  కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, ఇంజినీరింగ్ విద్యార్ధులకు సూచించారు.


గురువారం  ఉదయం  కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో  పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ప్రక్రియ పై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పాల్గొని మాట్లాడుతూ, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చేపట్టాల్సిన  వెబ్ కాస్టింగ్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని పోలింగ్ రోజున ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వెబ్ కాస్టింగ్ ప్రక్రియను నిర్వహించాలన్నారు.  వెబ్ కాస్టింగ్ ప్రక్రియలో పాల్గొను ప్రతి విద్యార్ధి స్వచ్ఛందంగా   ఎన్నికల నిర్వహణలో పాల్గొండటం సంతోషకరమని, కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ మొదలు అయినప్పటి నుండి పూర్తి అయ్యేంతవరకు  వెబ్ కాస్టింగ్ ప్రక్రియ చేపట్టాల్సి వుంటుందన్నారు. వెబ్ కాస్టింగ్ నిర్వహణపై ఈ రోజు ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో వెబ్ కాస్టింగ్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని ప్రతి విద్యార్ధి బాధ్యతతో వెబ్ కాస్టింగ్ విధులు నిర్వర్తించాలని కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, విద్యార్ధులకు సూచించారు.  ఈ నెల 13వ తేదీన ఉదయం 8 గంటల నుండి పోలింగ్ ప్రారంభమౌతుందని, పోలింగ్ పూర్తి అయ్యేంత  వరకు  పోలింగ్ కేంద్రాల్లో  వెబ్ కాస్టింగ్ ప్రక్రియ ద్వారా  లైవ్ కాస్టింగ్ ను  ఎలాంటి అంతరాయం కల్గకుండా నిర్వహించాలని కలెక్టర్,  ఇంజనీరింగ్ విద్యార్ధులకు సూచించారు.  


ఈ కార్యక్రమంలో జిల్లా  రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ,  వెబ్ కాస్టింగ్ నిర్వహణ నోడల్ అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ.ఈ శ్రీ రాజశేఖర్, ఇంజినీరింగ్  విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు. 


Comments