*కనులపండువగా శ్రీరామ నవమి*
*-సీతారాముల కల్యాణాన్ని*
*చూసి తరించిన భక్తజనం*
*-రామనామంతో మార్మోగిన ఆలయాలు*
మంగళగిరి (ప్రజా అమరావతి)!
మంగళగిరి -తాడేపల్లి నగర పరిధిలో శ్రీరామ నవమి వేడుకలు గురువారం వైభవంగా నిర్వహించారు. భక్తుల రామనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. నగరంలోని మెయిన్ బజారులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణోత్సవంలో తహశీల్దార్ జీవి రామ్ ప్రసాద్ దంపతులతో పాటు మరో 20 మంది దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్య వైశ్య సంఘ పెద్దలు సంకా బాలాజీ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గోలి లింగయ్య గారి రామ మందిరం వద్ద సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం ప్రతినిధులు మురుగుడు రవి, పందెపు రమేష్, జొన్నాదుల వెంకటరత్నం, యెనుముల నరసింహారావు, దామర్ల భావనా రుషి తదితరులు పాల్గొన్నారు. నగర పరిధిలోని యర్రబాలెం లోని రామాలయం, శ్రీనగర్ కాలనీ కోదండ రామాలయం తదితర ఆలయాల్లో సీతారాముల కల్యా ణాన్ని భక్తులు చూసి తరించారు. ఆయా ఆలయాల్లో భక్తులకు పానకం, వడపప్పును పంచిపెట్టి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలను నిర్వహించారు.
addComments
Post a Comment