శక్తి వంచన లేకుండా సేవ చేయాలి

 *శక్తి వంచన లేకుండా సేవ చేయాలి


*


*: జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్*


*: జిల్లా కేంద్రంలో జిల్లా విపత్తు స్పందన & అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మార్చి 29 (ప్రజా అమరావతి):


జిల్లా విపత్తు స్పందన & అగ్నిమాపక శాఖ ద్వారా శక్తి వంచన లేకుండా సేవ చేయాలని జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్ పేర్కొన్నారు. బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో జిల్లా విపత్తు స్పందన & అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు.


ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో హ్యుందయ్ గ్లోవియఎస్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ వారు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద జిల్లా విపత్తు స్పందన & అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ముందుండి హాజరయ్యే జిల్లా విపత్తు స్పందన & అగ్నిమాపక శాఖ అధికారి భవనం నూతనంగా ప్రారంభించడం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హ్యుందయ్ కంపెనీ వారు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా భవనం నిర్మించడం చాలా మంచి పరిణామమన్నారు. నూతన జిల్లాలో అవకాశం ఏముందో చూసుకుని ఉన్న భూమిలో సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం అభినందించదగ్గ విషయం అన్నారు.


ఈ సందర్భంగా జిల్లా డిడిఆర్&ఎఫ్ఓ శంకర ప్రసాద్ మాట్లాడుతూ హ్యుందయ్ గ్లోవియఎస్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ వారు సిఎస్ఆర్ ఆక్టివిటీ కింద రూ.64 లక్షల వ్యయంతో మూడు నెలల్లో జిల్లా విపత్తు స్పందన & అగ్నిమాపక అధికారి కార్యాలయం భవనాన్ని పూర్తి చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చొరవతో భవన నిర్మాణాన్ని కంపెనీ వారు ముందుకు వచ్చి చేపట్టడం జరిగిందన్నారు. పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక శాఖ తరపున ముందుండి శక్తివంచన లేకుండా సేవ చేస్తామన్నారు.


ఈ కార్యక్రమంలో హ్యుందయ్ గ్లోవియఎస్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ ఎండి జూసిఒక్ఓ, హెచ్ ఓ డి జేసు కుమార్, కర్నూలు జోన్-4 ఆర్ఎఫ్ఓ ఎం. భూపాల్ రెడ్డి, అనంతపురం డిడిఆర్&ఎఫ్ఓ శ్రీనివాస్ రెడ్డి, ఎయిర్పోర్ట్ ఏడిఎఫ్ఓ హేమంత్ రెడ్డి, ఏడిఎఫ్ఓ నాగరాజు నాయక్, ఎస్ఎఫ్ఓలు ప్రభాకర్, రాజు, షాదిక్ వలి, విజయ్ కుమార్, నాగేంద్ర నాయక్, అగ్నిమాపక శాఖ, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Comments