శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి): 

      ఈరోజు అనగా ది.07-03-2023 న పౌర్ణమి సందర్భముగా సాయంత్రం 05 గం.లకు లోకకళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు కొరకు మరియు ధర్మప్రచారం నిమిత్తం వేదపండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యముల నడుమ శ్రీ అమ్మవారి ప్రచార రథము వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తముగా పూజలు నిర్విహించి శ్రీ కామధేను అమ్మవారి ఆలయ ట్రస్ట్ర్మన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, బుద్దా రాంబాబు, నంబూరి రవి, బచ్చు మాధవీ కృష్ణ, కేసరి నాగమణి , కార్యనిర్వాహక ఇంజినీర్ ఎల్ రమాదేవి  పాల్గొని పూజలు నిర్వహించారు.

        గిరిప్రదక్షిణ కార్యక్రమము శ్రీ కామధేను అమ్మవారి ఆలయము, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి మీదుగా  మల్లిఖార్జున మహామండపమునకు  చేరుకున్నారు. గిరిప్రదక్షిణ మార్గము నందు భక్తులు ప్రచార రథము లో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామి వార్లకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు , కొబ్బరికాయ లు సమర్పించి, పూజలు చేసి, అమ్మవారిని, స్వామి వారిని ప్రార్థించి, అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు.అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే  గిరి ప్రదక్షిణ  చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి.

     ఈ కార్యక్రమం నందు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ , వైదిక సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు విశేషముగా పాల్గొన్నారు.

Comments