నెల్లూరు బ్యారేజికి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.నెల్లూరు, మార్చి 16 (ప్రజా అమరావతి):


నెల్లూరు బ్యారేజికి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  గత ఏడాది జిల్లాలో  పర్యటించిన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి, కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు బ్యారేజీ కి జిల్లాకు ఎనలేని సేవలు చేసిన మాజీ మంత్రి శ్రీ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా నామకరణం చేయవలసిందిగా విజ్ఞప్తి  చేసిన మేరకు జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రతిపాదనలు పంపిన విషయం విధితమే. ఈ మేరకు నెల్లూరు బ్యారేజి పేరును నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా మార్పు చేసి నోటిఫై చేస్తూ జీవో నెంబర్ 29 తో గురువారం(16-3-2023) ఉత్తర్వులు జారీ అయ్యాయి. పేరు మార్పు గురించి వచ్చే ఆంధ్రప్రదేశ్ గెజిట్  సంచికలో ప్రచురించడం జరుగుతుందని అందులో పేర్కొన్నారు.Comments