ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా సిబ్బందికి బహుమతులను అందజేసిన డి‌జి‌పి


డి‌జి‌పి కార్యాలయం (ప్రజా అమరావతి); 


*మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరి లోని డి‌జి‌పి ప్రధాన  కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని పోలీస్ ప్రధాన కార్యాలయం లోను  ఎఫ్‌ఎస్‌ఎల్, సాంకేతిక విభాగం లోను   విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా సిబ్బందికి బహుమతులను  అందజేసిన డి‌జి‌పి


కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి.*


 ఈ సంధర్భంగా డి‌జి‌పి గారు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది అని అందుకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను చేపట్టడంతో పాటు క్షేత్రస్థాయిలో అమలు చేస్తుందని అన్నారు. మహిళలపై జరిగే నేరాల ఫిర్యాదుల కోసం దిశ పోలీస్ స్టేషన్లు , వేదింపుల నుండి రక్షణ కల్పించడానికి దిశ అప్ ను అందుబాటు లోకి తీసుకురావడం జరిగింది. దిశ మొబైల్ అప్లికేషన్ ద్వారా రాష్ట్రం లోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీతో ప్రవేశ పెట్టిన  దిశా మొబైల్ అప్లికేషన్ (SOS) మొదట్లో కేవలం డౌన్ లోడ్ కి మాత్రమే పరిమితమైంది. కానీ గత సంవత్సర కాలవ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా  అత్యంత స్వల్ప వ్యవధి లోనే  1,11,46,452 మంది రిజిస్ట్రేషన్  చేసుకోవడం ఒక గొప్ప విశేషం అన్నారు. అదే విధంగా పోలీసు ప్రధాన కార్యాలయం లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు తమ పోనే లో దిశ అప్లికేషన్ ను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యల ద్వారా ఊహించిన దానికంటే మంచి ఫలితాలు వస్తున్నాయి. అంతే కాకుండా మహిళా కానిస్టేబుల్ వ్యవస్థ ద్వారా  క్షేత్రస్థాయి నుండి మంచి  ఫలితాలు అందుతున్నాయి. ఏదైనా కీలకమైన కేసుకు సంభందించిన నిందితుల గుర్తింపులో వారు కీలకంగా వ్యహరిస్తున్నారు. దిశ మొబైల్ అప్ ను రిజిస్టర్ చేయడం లో వీరు గననీయమైన పాత్ర పోషించారు.


మహిళా పోలీసుల ద్వారా గ్రామాల్లోనూ , పట్టణాల్లోనూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేదింపులపై ముందస్తు సమాచారం పోలీస్ స్టేషన్లకు చేరడంతో  మహిళలపై జరిగే అత్యాచారాల నిరోధం సులువైంది.


ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ IPS, సిఐడి అడిషనల్ డీజి సంజయ్, డి‌ఐ‌జి రాజకుమారి,  టెక్నికల్ సర్వీసెస్ డిఐజి లక్ష్మి తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments