ఏదైనా ఆస్తిపై స్పష్టమైన యాజమాన్య హక్కులను నిలబెట్టే పథకం స్వమిత్వా యోజన

 ఏదైనా ఆస్తిపై స్పష్టమైన యాజమాన్య హక్కులను నిలబెట్టే పథకం స్వమిత్వా యోజన 



జిల్లా సంయుక్త కలెక్టర్



పుట్టపర్తి,  మార్చి 17 (ప్రజా అమరావతి):   ఏదైనా ఆస్తిపై స్పష్టమైన యాజమాన్య హక్కులను నిలబెట్టే పథకం స్వమిత్వా యోజన అని  జిల్లా  సంయుక్త  కలెక్టర్  టీఎస్ చేతన్ పేర్కొన్నారు . శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని   స్పందన  వీడియో కాన్ఫరెన్స్ హాలు నందుస్వమిత్వా యోజన

పథకంపై అధికారులకు  శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూఇది దేశంలోని గ్రామాల అభివృద్ధికి కొత్త అధ్యాయాన్ని రాస్తుందని ఆయన పేర్కొన్నారు.

మన జిల్లాలో ప్రయోగాత్మకంగా స్వమిత్వా యోజన విజయవంతంగా  అమలు చేయాలని తెలిపారుఈ పథకం గ్రామ స్వరాజ్‌కు ఒక ఉదాహరణ అవుతుంది” అని ఆయన అన్నారు. సామాజిక ఆర్థికంగా సాధికారత, స్వయం-ఆధారిత గ్రామీణ భారతదేశాన్ని ప్రోత్సహించడానికి స్వమిత్వా (గ్రామాల సర్వే, గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో మ్యాపింగ్) పథకాన్ని ప్రధాన మంత్రి ఏప్రిల్ 24, 2020 న కేంద్ర రంగ పథకంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తిపై స్పష్టమైన యాజమాన్యాన్ని స్థాపించడం, డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ల్యాండ్ పార్సిల్స్ మ్యాపింగ్ చేయడం అదేవిధంగా అర్హులైన కుటుంబాలకు చట్టపరమైన యాజమాన్య కార్డులను జారీ చేయడం ద్వారా హక్కుల రికార్డును అందించడం ఈ పథకం లక్ష్యం.

SVAMITVA ప్రయోజనాలు:

✧ ఈ పథకంలో గ్రామీణ ప్రజల ప్రాపర్టీని ఆర్థిక సంపదగా గుర్తిస్తారు. తద్వారా వారికి బ్యాంకుల్లో రుణాలు పొందడం తదితర ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.

✧ స్వమిత్వ ద్వారా గ్రామాల్లోని ప్రజల వ్యక్తిగత ఆస్తుల వివరాలతో పాటు ప్రభుత్వ రంగ ఆస్తుల వివరాలను కూడా సరిహద్దులతో సహా నిర్ణయిస్తారు.

✧ ప్రతి ఇంటితో పాటు రోడ్లు, చెరువులు, పార్కులు, దేవాలయాలు, అంగన్‌వాడీ, హెల్త్‌సెంటర్‌, పంచాయతీ కార్యాలయం లాంటి అన్ని ఆస్తులను ఈ సర్వేలోకి చేర్చనున్నారు.

✧ సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా తమ సొంత ఇళ్లపై బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు జరపలేకపోతున్న వారికి స్వమిత్వ ప్రాపర్టీ కార్డుల ద్వారా ఆ లోటు తీర్చాలనేది ప్రభుత్వ ప్రధాన  ఉద్దేశం.జిల్లాలో 13వ నోటిఫికేషన్ కూడా  విడుదల చేయడం జరిగింది.  ఈ పథకాన్ని 3 మండలాలలో  పటిష్టంగా అమలు చేయడానికి  చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గాండ్లపెంట మండలం కమతంపల్లి గ్రామం, బత్తలపల్లి మండలం  చెనరాయి పట్నం, సోమందేపల్లి మండలం ఎస్ కొత్తపల్లి నందు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని  తెలిపారు   ఈ శిక్షణ కార్యక్రమాన్ని  సద్వినియోగం చేసుకొని క్షేత్రస్థాయిలో మీ ప్రతిభను కనబరచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ బాలాజీ, ల్యాండ్ సర్వే ఏడి రామకృష్ణయ్య, జిల్లాలోని రీసర్వ్ డిప్యూటీ తహల్దారులు, పంచాయతీ సెక్రటరీ, సర్వే బృందం తదితరులు పాల్గొన్నారు


  


 

Comments