*రాజంపేట నియోజకవర్గం*
ఒంటిమిట్ట మండలం (ప్రజా అమరావతి);
*ధ్వజారోహణంతో వైభవంగా
శ్రీ కోదండరామ స్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
ప్రారంభం*
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 నుండి 10.20 గంటల వరకు వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు.
ఈ సందర్భంగా సతీ సమేతంగా రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి మరియు జేఈవో శ్రీ వీరబ్రహ్మం ధ్వజారోహణ కారిక్రమంలో పాల్గొన్నారు, స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 3న హనుమంత వాహనం, ఏప్రిల్ 5న కల్యాణోత్సవం, ఏప్రిల్ 6న రథోత్సవం, ఏప్రిల్ 8న చక్రస్నానం జరుగుతాయన్నారు. కల్యాణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కల్యాణానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు.
addComments
Post a Comment