శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):

     ఆలయ పాలకమండలి ఏర్పాటు జరిగి నెల రోజులు గడిచిన సందర్బంగా ఈరోజు  ఆలయ ట్రస్ట్ బోర్డు కార్యాలయం నందు  ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కర్నాటి రాంబాబు గారు మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు కేసరి నాగమణి, కట్టా సత్తయ్య, బుద్ధ రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, శ్రీమతి బచ్చు మాధవి కృష్ణ, నంబూరి రవి, చింకా శ్రీనివాస్,  కొలుకులూరి రామ సీత, అల్లూరి కృష్ణవేణి, తొట్టడి వేదకుమారి గార్లు

సమావేశమాయ్యారు. 

 ఈ సమావేశం నందు ముఖ్యంగా ఆలయమునందు చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమముల గురించి  చర్చించినారు. ట్రస్ట్ బోర్డు సమావేశం నందు చర్చించి ఆమోదించిన అంశములు పై మరల ఫాలోఅప్ చేసి,  ఇక నుండి ప్రతి నెల ఈ విధముగానే మీటింగ్ పెట్టుకుని ప్రతి అంశంపై క్షుణ్ణంగా చర్చించి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించారు.

Comments