ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం

 *ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం


*


*: జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మార్చి 12 (ప్రజా అమరావతి):


ఈనెల 13వ తేదీన సోమవారం జరగనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల కోసం జిల్లాలో 11 రూట్లను, 86 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో పట్టభద్రుల ఎన్నికల కోసం 54 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో 13 సాధారణ, 11 సమస్యాత్మక, 8 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయన్నారు. అలాగే పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో 20 సాధారణ, 18 సమస్యాత్మక, 16 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయన్నారు.


జిల్లాలో 3,348 మంది ఉపాధ్యాయులు, పట్టభద్రులు 43,310 మంది ఓటు హక్కును కలిగి ఉన్నారని, వారు ఓటును వినియోగించుకోనున్నారు. ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఉపాధ్యాయుల ఎన్నికలకు 46 మంది ప్రిసైడింగ్ అధికారులను, 47 మంది ప్రిసైడింగ్ అధికారులు -1 లను ఏర్పాటు చేశామన్నారు. పట్టభద్రుల ఎన్నికలకు 67 మంది ప్రిసైడింగ్ అధికారులను, 60 మంది ప్రిసైడింగ్ అధికారులు -1 లను ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 108 మంది అబ్జర్వర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ క్యాస్టింగ్ మరియు వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామన్నారు. పట్టభద్రుల ఎన్నికలకు 198 బిగ్ బ్యాలెట్ బాక్సులు, ఉపాధ్యాయుల ఎన్నికలకు 37 బిగ్ బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారన్నారు. ఎన్నికల నిర్వహించేందుకు అధికారులకు అన్ని రకాల మెటీరియల్ అందజేశామన్నారు. ఎన్నికల కోసం పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. తాము వేసిన ఓటు చెల్లుబాటు అయ్యేలా ఓటర్లు ఓటు వేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నిక జరగనున్నదని కలెక్టర్ తెలిపారు. బ్యాలట్ పేపర్ పై ఎటువంటి గుర్తులూ ఉండవని, అభ్యర్ధుల పేర్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. అభ్య‌ర్థుల‌ పేరుకు ఎదురుగా అంకెల‌తోనే ఓటు వేయాల్సి ఉంటుంద‌న్నారు.  ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్ధులందరికీ ఓటు వేయవచ్చున‌ని సూచించారు.



Comments