*- రావికి కృతజ్ఞతలు తెలిపిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ
*
*- కోరాడతో కలిసి వేపాడను సన్మానించిన రావి*
మంగళగిరి, మార్చి 20 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన వేపాడ చిరంజీవిరావు కృతజ్ఞతలు తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి గుడివాడ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి హాజరయ్యారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే రావిని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకునిగా చంద్రబాబు నియమించడం జరిగింది. చంద్రబాబు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే రావి భీమిలి నియోజకవర్గంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుకు మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పర్యటనలు, సభలు, సమావేశాలతో పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజయానికి తీవ్రంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మంగళగిరిలో చంద్రబాబు అధ్యక్షతన నియోజకవర్గ ఇన్చార్జిలతో జరిగిన సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే రావితో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు సమావేశమయ్యారు. తన విజయానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే రావికి ఎమ్మెల్సీ వేపాడ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కోరాడ రాజబాబుతో కలిసి ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావును మాజీ ఎమ్మెల్యే రావి ఘనంగా సన్మానించారు.
addComments
Post a Comment