జగనన్న గోరుముద్ద కింద రాగిజావ పంపిణీ ప్రారంభం

 జగనన్న గోరుముద్ద కింద రాగిజావ పంపిణీ ప్రారంభం


*


*: జిల్లాలో 2,034 పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద కింద 1,46,744 మంది విద్యార్థులకు లబ్ధి*


*: విద్యార్థుల్లో రక్తహీనత లోపాన్ని తగ్గించేందుకు రాగి జావ ఎంతో ఉపయోగం*


*: జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*


*పిల్లలను మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు రాగిజావ ఉపయోగపడుతుంది : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్*


కొత్తచెరువు (శ్రీ సత్యసాయి జిల్లా), మార్చి 21 (ప్రజా అమరావతి):


*తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం వర్చువల్ విధానం ద్వారా జగనన్న గోరుముద్దలో మరో పోషకాహారం అందించడంలో భాగంగా బడిపిల్లలకు ఉదయం పూట రాగిజావ అందించడాన్ని ప్రారంభించే బృహత్తర కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.*


*శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్, ఏడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత, ఆర్డీఓ భాగ్యరేఖ, ఇంచార్జి డిఈఓ మీనాక్షి, పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్, తహసీల్దార్ రామచంద్ర, ఎంపిడిఓ సిద్ధారెడ్డి, సర్పంచ్ రాధా, జడ్పిటిసి గంగాదేవి, ఎంపిపి గాయత్రి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా జిల్లాలో 2,034 పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలవుతోందని, ఈ పథకం కింద ప్రతిరోజు 1,46,744 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ పథకం కింద కొత్త మెనూలో భాగంగా వారానికి ఐదు సార్లు కోడిగుడ్లు, వారానికి మూడుసార్లు చిక్కిలు ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థుల్లో రక్తహీనత లోపాన్ని తగ్గించేందుకు రాగి జావ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల్లో ఆరోగ్య ప్రమాణాల్ని మరింత పెంచి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని అనతి కాలంలోనే సాధించేందుకు మరో ముందడుగు వేయడంలో భాగంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, వారి సేవాదళ సభ్యులు ప్రసాదాన్ని రాగిజావ రూపంలో పంపిణీ చేస్తూ విద్యార్థుల నరనరాల్లో నైతిక విలువలతో కూడిన సంపూర్ణ విద్య అందించేందుకు తోడ్పాటు అందిస్తూ ముందుకు వెళుతున్నారన్నారు. రాగి జావ అందించే బృహత్తర కార్యక్రమం వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.*


*పిల్లలను మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు రాగిజావ ఉపయోగపడుతుంది : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్*


*హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో మరో పోషకాహారం అందించడంలో భాగంగా బడిపిల్లలకు ఉదయం పూట రాగిజావ అందించేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. పిల్లలను మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు రాగిజావ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు అందించి విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాల లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శనివారాలు) బెల్లంతో కూడిన రాగి జావను విద్యార్థులకు జగనన్న ప్రభుత్వం అందించనుందని, మిగిలిన మూడు రోజులు గోరుముద్దలో భాగంగా చిక్కి అందిస్తున్నారన్నారు. సీఎం జగనన్న విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారన్నారు.*


*ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో 

 సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ మాట్లాడారు.

అందరికీ నమస్కారం, శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ తరపున ఈ గొప్ప కార్యక్రమంలో మేం భాగస్వామ్యం కావడంపై చాలా ఆనందంగా ఉంది. బాబా భక్తులు కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎంగారి నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. మీరు చేస్తున్న అనేక కార్యక్రమాలు పిల్లలకు చాలా తోడ్పాటుగా ఉంటున్నాయి. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద లక్షల రూపాయిలు వెచ్చించి విద్యార్ధులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించడం గొప్ప విషయం. మీ నాయకత్వంలో ఇలాంటి అనేక గొప్ప కార్యక్రమాలు మరింతగా కొనసాగాలని కోరుకుంటున్నాను. 


*ధనుశ్రీ,, 8 వతరగతి విద్యార్ధిని, జెడ్‌పీహెచ్‌ఎస్, కొత్తచెరువు, శ్రీసత్యసాయి జిల్లా


సీఎం సార్, రాగి జావ చాలా బావుంది, ఏపీ ప్రభుత్వం విద్యావ్యవస్ధలో అనేక మార్పులు తీసుకొస్తుంది, అమ్మ ఒడి, నాడు నేడు, జగనన్న గోరుముద్ద ఇలా అనేక రకాలుగా మార్పులు జరిగాయి, గోరుముద్దలో 15 వెరైటీలు, గుడ్లు, చిక్కీ ఇలా అన్నీ ఇస్తున్నారు. నాడు నేడు లో భాగంగా మా స్కూల్స్‌లో టాయిలెట్స్‌ చక్కగా ఉన్నాయి, నిర్వహణ బావుంది. బాలికలకు శానిటరీ నాప్కిన్స్‌ కూడా ఇస్తున్నారు. నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, ఈ ప్రభుత్వ పాఠశాలలో చదవుకోవడాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. నేను భవిష్యత్‌లో బాగా చదువుకుని ఈ ప్రభుత్వంలో పనిచేయాలని భావిస్తున్నాను. జగన్‌ మామయ్య నేను కన్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అన్న విధంగా ఏపీ ప్రజలు కోరుకున్నారు, మీరు పేదలకు ఉపయోగపడేలా అనేక పథకాలు తీసుకొచ్చారు. మాట తప్పను మడమ తిప్పను అన్న విధంగా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు. ఈ కార్యక్రమంలో వర్క్ బోర్డ్ వైస్ చైర్మన్  షాన్  సెట్, ఎంపీటీసీ మహమ్మద్ రఫీ,  ఆవుల రాము సంబంధి  అధికారులు తదితరులు పాల్గొన్నారు


 

Comments