రాజమండ్రిలో అడ్వెంచర్ క్యాంప్ - ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎంపీ భరత్

 రాజమండ్రిలో అడ్వెంచర్ క్యాంప్


- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎంపీ భరత్రాజమండ్రి, మార్చి 19 (ప్రజా అమరావతి): సాహసాలు చేయాలని అందరికీ ఉంటుంది. కానీ నిజంగా చేయాలంటే మాత్రం గుండె దడదడలాడిపోతుంది. కాళ్ళు వణుకుతాయి. సాహసాలు చేసిన వారిని చూస్తే కళ్ళింత చేసి అభినందన పూర్వకంగా, ఎంతో ఆసక్తిగా చూస్తాం. 

అచ్చం అలానే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ను చూశారు ఆదివారం జరిగిన ఒక అడ్వెంచర్ క్యాంప్ లో. రాజమండ్రి రూరల్ కడియం మండలం బుర్రిలంక గ్రామంలో ఇసుక ర్యాంప్ వద్ద 'మహేంద్రా థార్ అడ్వెంచర్ క్యాంప్' నిర్వహించారు. ఎంతో మంది పాల్గొన్నారు. వీరు చేసే సాహసోపేతమైన డ్రైవింగ్ విన్యాసాలు చూసేందుకు ప్రజలూ అధికంగానే తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి యువకుడు, ఉత్సాహవంతుడు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే ఈ కార్యక్రమ నిర్వాహకులు ఏదో రాజకీయ నాయకుడు.. రెండు మాటలు చెప్పేసి అందరికిలా వెళ్ళిపోతారని భావించారు. మరి మన ఎంపీ భరత్ శైలే వేరు కదా. అడ్వెంచర్ క్యాంప్ లోకి అడుగుపెట్టగానే ఆ కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులను ఎంపీకి పరిచయం చేశారు. వారితో కరచలనం తరువాత.. ఎంపీ భరత్ తన హీరోయిజం చూపించారు. అక్కడే ఉన్న ఒక వాహనంలోకి వెళ్ళి, సీటు బెల్ట్ పెట్టుకుని..టోపీ పెట్టుకుని జీప్ డ్రైవ్ చేయడం మొదలెట్టారు. అదేమీ సాధారణమైన రోడ్డు కాదు..జుయ్య్ మంటూ హుషారుగా వాహనం నడపడానికి. ఇసుక..పెద్ద పెద్ద గుట్టలు. వాటిపై నుండి జుమ్మ్ అంటూ స్పీడ్ గా డ్రైవ్ చేయడంతో అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ‌అందరి చూపూ మెరుపు వేగంగా దూసుకుపోతున్న ఎంపీ భరత్ డ్రైవ్ చేసే వాహనంపైనే. ఊపిరి బిగపట్టి మరీ వీక్షించారు. ‌ఎక్కడ నుండి ప్రారంభించారో మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చి చేరుకోగానే ఈ క్యాంప్ లో పాల్గొనేందుకు వచ్చిన యువతీ యువకులు ఎంపీని అభినందించకుండా ఉండలేకపోయారు. అంతేనా ఆయనతో సెల్ఫీలకు పోటీ పడ్డారు.

Comments