అర్బన్ హెల్త్ సెంటర్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు

 గుంటూరు (ప్రజా అమరావతి);    రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి  ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ YSR పట్టణ ఆరోగ్య కేంద్రాలు గుంటూరు నగరంలోని 16వ డివిజన్ ఏటుకూరు వద్ద 1.13 కోట్ల రూపాయలతో* మరియు 3వ డివిజన్ ప్రగతి నగర్ వద్ద 1.05 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభిస్తున్న గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు


, MLAలు మేకతోటి సుచరిత ,మహమ్మద్ ముస్తఫా.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ,

ప్రగతి నగర్ మరియు ఏటుకూరు ప్రాంతంలో పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివాశిస్తూ ఉంటారని,ఈ ప్రాంతాలలో అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించాలని స్థానిక ప్రజల చిరకాల వాంచ అన్నారు.

రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా మరియు వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ,ఆయా రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారన్నారు.

రాష్ట్రంలో విద్య వైద్య రంగాలను బలోపేతం చేస్తూ పేద ప్రజలకు సత్వర సేవలందే విధంగాచర్యలు తీసుకుంటున్నారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 560 అర్బన్ హెల్త్ సెంటర్లను మంజూరు చేయగా,మరి ముఖ్యంగా గుంటూరు నగరంలో 16 యు.హెచ్.సి లను మంజూరు చేసినారు.

ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న అర్బన్ హెల్త్  సెంటర్ల వలన పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు.

ఈ హెల్త్ సెంటర్ల యందు క్వాలిఫైడ్ డాక్టర్లను మరియు ANM లను నియమించి,ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ హెల్త్ సెంటర్ల వలన ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు.  

అర్బన్ హెల్త్ సెంటర్ల వద్దకు వచ్చే రోగుల యొక్క హెల్త్ కండిషన్ ను డిజిటలైజేషన్ చేయటం జరుగుతుందన్నారు.

ఈ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణంలో ఎక్కడ రాజీ లేకుండా అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మించుట జరిగిందన్నారు.

హెల్త్ సెంటర్ల యందు అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేసి,దానిని బట్టి రోగులకు,వైద్య సేవలు అందించుట జరుగుతుందన్నారు.

గుంటూరు నగరంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా నూతనంగా 16 అర్బన్ హెల్త్  సెంటర్లను అధునాతన హంగులతో నిర్మిస్తున్నామని,ఇప్పటికే ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లకు మరమ్మతులు కూడా నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వనమా బాల వజ్రబాబు,షేక్ సజీల,గుంటూరు తూర్పు నియోజకవర్గ YSRCP మహిళా నాయకురాలు షేక్ నూరి ఫాతిమా వివిధ డివిజన్ల కార్పొరేటర్లు,నగర పాలక సంస్థ అధికారులు,వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,YSRCP ముఖ్య నాయకులు,వివిధ శాఖల అధికారులు,స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

Comments