శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):

            గౌరవ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు మరియు దేవాదాయశాఖ కమీషనర్ వార్ల ఉత్తర్వుల మేరకు ఆలయ వైదిక కమిటీ సభ్యుల వారి సూచనల మేరకు లోకకళ్యాణార్థం సంకల్పించి ది.02-03-2023 నుండి 06-03-2023 వరకు దేవస్థానం నందు శత చండీ సహిత మహారుద్రయాగం మరియు ది.07-03-2023 న  పౌర్ణమి సందర్బంగా గిరిప్రదక్షిణ నిర్వహించనున్న సందర్బంగా ఈరోజు మధ్యాహ్నం మీడియా మిత్రుల సమావేశం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి కార్యాలయం నందు నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం నందు ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ కర్నాటి రాంబాబు గారు మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవాదాయశాఖ కమీషనర్ వార్ల ఉత్తర్వుల మేరకు ఆలయ వైదిక కమిటీ సభ్యుల వారి సూచనల మేరకు లోకకళ్యాణార్థం సంకల్పించి శత చండీ సహిత మహారుద్రయాగం ది.02-03-2023 ఉదయం 10 గం. లకు గణపతి పూజతో ప్రారంభమై, 06-03-2023 ఉ.10.30 గం.లకు వేదంపండితులచే ఆశీర్వచనం తదితర వైదిక కార్యక్రమములతో ముగియనుందని  తెలిపారు. అనంతరం ది.07-03-2023 న పౌర్ణమి సందర్బంగా సాయంత్రం నిర్వహించు గిరి ప్రదక్షిణ వివరములు గురించి తెలిపి, గిరిప్రదక్షిణ సందర్బంగా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమములలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరారు.

     అనంతరం ఆలయ కార్యనిర్వాహనాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు మాట్లాడుతూ 

గౌరవ రాష్ట్ర ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయశాఖ మంత్రివర్యులు మరియు దేవాదాయశాఖ కమీషనర్ వార్ల ఉత్తర్వుల మేరకు అన్ని దేవాలయంలలోనూ లోకకళ్యాణార్థం కార్యక్రమములు నిర్వహించవలసినదిగా ఆదేశించిన మేరకు శ్రీ అమ్మవారి ఆలయము నందు ఆలయ వైదిక కమిటీ సభ్యుల వారి సూచనల మేరకు  శత చండీ సహిత మహారుద్రయాగం ది.02-03-2023 ఉదయం 10 గం. లకు గణపతి పూజతో ప్రారంభమై, 06-03-2023 వరకు జరుగు వైదిక కార్యక్రమముల గురించి తెలిపారు.  అనంతరం ది.07-03-2023 న  పౌర్ణమి సందర్బంగా సాయంత్రం నిర్వహించు గిరి ప్రదక్షిణ వివరములు గురించి తెలిపారు. రానున్న వేసవి కాలం దృష్ట్యా ఆలయ పాలకమండలి ఛైర్మన్, సభ్యులు, వైదిక సిబ్బందితో చర్చించి గిరిప్రదక్షిణ కార్యక్రమం సాయంత్రం నిర్వహించుటకు నిర్ణయించామని తెలిపారు. గిరిప్రదక్షిణ సందర్బంగా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని, నడవలేని భక్తుల కొరకు ఒక బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమములకు హాజరై శ్రీ అమ్మవారి, స్వామి వారి కృపను పొందవలసినదిగా కోరారు.

       అనంతరం ఆలయ స్థానాచార్యుల వారు మాట్లాడుతూ దేవస్థానం నందు రేపటి నుండి నిర్వహించు శతచండీ సహిత మహారుద్రయాగం మరియు పౌర్ణమి సందర్బంగా నిర్వహించు ఇంద్రకీలాద్రి   గిరిప్రదక్షిణ కార్యక్రమ విశిష్టత గురించి తెలియజేశారు.


    ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు  బచ్చు మాధవీ కృష్ణ, బుద్దా రాంబాబు, కట్టా సత్తయ్య, చింతా సింహాచలం గార్లు, స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు, వైదిక సిబ్బంది ఆర్. శ్రీనివాస శాస్త్రి గారు, కార్యనిర్వాహక ఇంజినీర్ కె. వి.ఎస్ కోటేశ్వర రావు గారు, సహాయ కార్యనిర్వాహణాధికారి ఎన్. రమేష్ గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Comments