రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి

 రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి*


*: డిఆర్ఓ కొండయ్య*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మార్చి 01 (ప్రజా అమరావతి):


ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డిఆర్ఓ కొండయ్య ఆదేశించారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ రాజకీయ పార్టీల నేతలు ఎమ్మెల్సీ ఎన్నికలు విజయవంతంగా జరిగేందుకు తమ సహాయ సహకారాలు అందించాలన్నారు. నేతలు ఎవరు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘి0చరాదన్నారు. మండల, గ్రామ స్థాయిలో ఓటర్ లను చైతన్యవంతం చేయాలన్నారు. ముఖ్యంగా బ్యాలెట్ పేపర్ పై చేయాల్సినవి 1,2,3 అనే అంకెలు మాత్రమే వేయాల్సి ఉంటుందని, బ్యాలెట్ పేపర్ పై ముందు 1 అనే నెంబర్ తప్పక వేసినా తర్వాతనే 2,3,4  అంకెలు వేయాలని సూచించారు. అభ్యర్థి పేరుకు ఎదురుగా బాక్స్ లో మాత్రమే నెంబర్ వేయాలన్నారు. బ్యాలెట్ పేపర్ పై నంబర్స్ ను అక్షరాలతో రాయకూడదని, బ్యాలెట్ పేపర్ పై 1 వేయకుండా 2,3,4 అని వేస్తే ఓట్లు చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. అలాగే బ్యాలెట్ పేపర్ పై ఎలాంటి గుర్తులుగా కానీ, మార్కులు కానీ, వేలిముద్రలు కానీ పెట్టరాదని అలాంటివి ఉన్నట్లయితే ఆ ఓటు చెల్లదన్నారు.


ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరుగకుండా పకడ్బందీగా అమలు చేయాలని, ఉల్లంఘనలు ఉంటే వాటిపై ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు  తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.   ఉద్యోగస్తులు ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన రాదని, ఎన్నికల ప్రచారం కొరకు పార్టీలు ప్రభుత్వ భవనాలు, సంస్థలు, సామాగ్రిని వినియోగించరాదని, అతిక్రమించిన వారి పై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.


 ఈ సమావేశంలో  సిపిఐ పార్టీ ప్రతినిధి వేమయ్య, సిపిఎం పార్టీ ప్రతినిధి   వెంకటేశు, బయన్న, కులాయప్ప, గంగాధర్, ఆంజనేయులు, బిజెపి పార్టీ ప్రతినిధి  బాల నాయక్ , ఎన్నికల సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నేతలు, తదితరులు పాల్గొన్నారు.Comments