వివాహిత మహిళా హక్కులు,హక్కుల సాధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు " పుస్తక ఆవిష్కరణ.

 *" వివాహిత మహిళా హక్కులు,హక్కుల సాధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు " పుస్తక ఆవిష్కరణ.*


   మంగళగిరి (ప్రజా అమరావతి);

 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయం మంగళగిరి లో చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్ర రెడ్డి  మార్పు ట్రస్ట్ ద్వారా రచించిన పుస్తకం "వివాహిత మహిళా హక్కులు, హక్కుల సాధనలో తీసుకోవలసిన జాగ్రత్తలు"  ఆవిష్కరించారు.              


ఈ కార్యక్రమంలో కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ శ్రీ. రాంమోహన్  పాల్గొన్నారు.


ఈ సందర్భంగా చైర్మన్ హేమచంద్రారెడ్డి  మాట్లాడుతూ, ఈ పుస్తకంలో పొందుపరచిన వివాహిత మహిళా హక్కులు, వాటిని సద్వినియోగం చేసుకునే ప్రక్రియలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ రోజుల్లో చాలా ఉపయోగ పడతాయని కొనియాడుతూ పుస్తక రచన చేసిన మార్పు ట్రస్ట్ డైరెక్టర్ శ్రీమతి రావూరి సూయజ్ ను మరియు అనుపమ దార్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ ను అభినందిచారు. 


యూనివర్సిటీ లలో, కాలేజీ ల యందు ఈ పుస్తకానికి విస్తృత ప్రచారానికి సహకరిస్తానని  తెలియజేసారు.


ఈ కార్యక్రమంలో శ్రీమతి కృష్ణ కుమారి రిటైర్డ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విమెన్ వెల్ఫేర్, మార్పు ట్రస్ట్ లో ఇంటర్నషిప్ చేస్తున్న మారిస్ స్టెల్లా కాలేజీ స్టూడెంట్స్ కళ్యాణి, దయాన పాల్గొన్నారు.

       

ఈ పుస్తకం కావలసిన వారు మార్పు ట్రస్ట్ డైరెక్టర్ రావూరి సూయజ్ గారిని (9701056808) సంప్రదించవసిందిగా కోరడమైనది.

Comments