అనపర్తిలో వంద పడకల ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవం

 అనపర్తిలో వంద పడకల ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవం



- ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్


రాజమండ్రి, మార్చి 25 (ప్రజా అమరావతి): రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం ప్రధాన కేంద్రం అనపర్తిలో వంద పడకల  ఏరియా ఆసుపత్రి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆసుపత్రి భవనాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనపర్తిలో 30 పడకలతో సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)గా ప్రజలకు వైద్య సేవలందించేది. దానిని‌ అనపర్తి ఏరియా ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేసి వంద పడకలతో, 96 మంది వైద్య సిబ్బందితో ఇకపై అనపర్తి చుట్టు ప్రక్కల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేలా అన్ని విభాగాలు ఏర్పాటు చేశారు. ‌ప్రస్తుతం 66 మంది వైద్య సిబ్బంది విధుల్లోకి చేరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిత్యా విద్యా సంస్థల ఛైర్మన్ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments