ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

 *ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు


*


*: కంట్రోల్ రూమ్ మొబైల్ నెంబర్ 9154968576 కి ఓటర్లు కాల్ చేయవచ్చు*


*: ఏ ఫిర్యాదులు ఉన్నా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి తెలియజేయవచ్చు*


*: కంట్రోల్ రూమ్ ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి*


*: జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మార్చి 12 (ప్రజా అమరావతి):


ఈనెల 13వ తేదీన సోమవారం జరగనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ తెలిపారు. కంట్రోల్ రూమ్ మొబైల్ నెంబర్ 9154968576 కి ఓటర్లు కాల్ చేసి ఏ ఫిర్యాదులు ఉన్నా తెలియజేయవచ్చన్నారు. ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కంట్రోల్ రూమ్ ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 13వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుందని, ఓటర్లు కంట్రోల్ రూమ్ ని ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.Comments