అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ముందస్తు అరెస్టులు

 *అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ముందస్తు అరెస్టులు


*

మంగళగిరి (ప్రజా అమరావతి);

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో జీవో నెంబర్ 1ని రద్దు డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఐ, టిడిపి,  సిపిఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం  దృష్ట్యా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా  పట్టణ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం పోలీసులు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, ఏఐటీయూసీ నేతలు   మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు అన్నవరపు ప్రభాకర్, మాజీ మున్సిపల్ వైర్ చైర్మన్ నందo బ్రహ్మేశ్వర రావు, సిపిఎం జిల్లా నాయకులు జె వి రాఘవులు, పట్టణ కార్యదర్శి ఎస్ఎస్ చెంగయ్య, సిఐటియు నాయకులు బాలాజీ. దామర్ల రాజు. మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు.  తోట పార్థసారథి. మంగళగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. షేక్ రియాజ్. మంగళగిరి తన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి. అబ్దుల్ మజీద్. రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి లను పోలీసులు అదుపులోనికి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

41 ఏ నోటీసులు ఇచ్చి పంపించకుండా. పోలీస్ స్టేషన్ లోనే ఉంచడం అన్యాయమని ఇది ప్రజాస్వామ్యం కూని చేయడమే కాకుండా ప్రజల హక్కులను కలరాయడమే అని నేతల ప్రశ్నిస్తున్నారు.

Comments