ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు.

 *ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు*


*: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 15 (ప్రజా అమరావతి):


జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు పేర్కొన్నారు. శనివారం బుక్కపట్నం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ బాలుర, జడ్పీహెచ్ బాలికల పాఠశాలలో 10 వ తరగతి పరీక్షల్లో భాగంగా నిర్వహించిన సోషల్ స్టడీస్ పరీక్షను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు జిల్లాలో సజావుగా, ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. పరీక్షలు సజావుగా, సక్రమంగా, ప్రశాంతంగా నిర్వహించడం పట్ల చీఫ్ సూపరింటెండెంట్లకు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు, స్క్వాడ్ లకు, ఇన్విజిలేటర్లకు, అలాగే పరీక్షల నిర్వహణలో పాల్గొన్నటువంటి ప్రతి సిబ్బందికి అభినందనలు తెలిపారు.



Comments