12వ తరగతి విద్యార్థులకు ఈ నెల 28న ఒకేషనల్ ట్రేడ్ కోర్స్ పరీక్ష.

 *ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం*

*పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా*


విజయవాడ (ప్రజా అమరావతి);


*12వ తరగతి విద్యార్థులకు ఈ నెల 28న ఒకేషనల్ ట్రేడ్ కోర్స్ పరీక్ష*

మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, ప్రభుత్వ యాజమాన్య కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియెట్ ఒకేషనల్ 12వ తరగతి (లెవెల్ -4) విద్యార్థులకు ఈ నెల 28న ఒకేషనల్ ట్రేడ్ కోర్స్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి గురువారం ఆదేశాలు జారీ చేశారని  సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.  

ఈ సందర్భంగా అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలల్లోని 2022-23 విద్యా సంవత్సరానికి గానూ 12వ తరగతి (లెవల్-4) చదువుతున్న విద్యార్థులకు నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్ వర్క్ (NSQF) వొకేషనల్ ట్రేడ్ కోర్స్ థియరీ ఎగ్జామినేషన్ ఈ నెల 28న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా అధికారులకు సమగ్ర శిక్షా ఎస్పీడీ ఆదేశించారు.






Comments