*బంగారు పథాకం సాదించిన సాదియాను అభినందించిన కెఎల్ యు విసి డాక్టర్ జి.పార్ధసారదివర్మ.*
తాడేపల్లి (ప్రజా అమరావతి);
హిమాచల్ ప్రదేశ్ లోని సెంట్రల్ యూనివర్శిటీలో గత నెలలో జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ ఫవర్ లిప్టింగ్ మహిళా చాంపియన్ షిప్ లో కెఎల్ విశ్వవిద్యాలయంలో బిఎ ఐఎఎస్ చదువుతున్న సాదియా అల్మాస్ ఆలిండియా మొదటి స్థానం సాదించడం పట్ల విశ్వవిద్యాలయ వైస్ చాన్సులర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు విసి చాంబర్ లో సాధియాను ఘనంగా సత్కరించిన ఆయన భవిష్యత్తులో మరిన్ని పథకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రపంచ స్థాయిలో అనేక బంగారు పథకాలను సాదించిన సాధియా ధేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా అత్యంత బలమైన మహిళ గా బిరుదును సాదించిన సాదియా నేటి తరం బాలికలందరికీ ఆదర్శమని అన్నారు. 57కేజీల బరువు కేటగిరిలో బెచ్ ప్రెస్ బరువు 77 కిలోలు కాగా, డెడ్ లిప్ట్ 175 కేజీలు మొత్తం 452 కిలోల బరువును లేపి సాదియా భారత దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
సాదియా తండ్రి స్వయంగా ఫవర్ లిప్టింగ్ లో శిక్షణ ఇవ్వడం సాదియా ఆ కోణంలో ముందుకు దూసుకుపోవడం ఎంతో శుభపరిణామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గాను కెఎల్ విశ్వవిద్యాలయంలో తాము ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పలు రకాల క్రీడల్లో క్రీడాకారులు అనేక పథకాలను సాదించే విదంగా కెఎల్ క్రీడి విబాగం పనిచేస్తుందన్నారు. ఈ సందర్బంగా క్రీడా విబాగ అసోసియేట్ డీన్ డాక్టర్ కె.హరికిషోర్ ను, వ్యాయామ అద్యాపకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ జి.పార్ధసారధివర్మ, ప్రోవైస్ ఛాన్స్ లర్ డాక్టర్ ఎన్.వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు,ఎంహెచ్ఎస్.డీన్ డాక్టర్ ఎం.కిషోర్ బాబు, క్రీడల విబాగ అసోసియేట్ డీన్ డాక్టర్ కె.హరికిషోర్, విద్యార్ధి విభాగపు సంక్షేమ అధికారి సలహాదారులు డాక్టర్ హబీబుల్లాఖాన్, సాదియా తండ్రి తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment