అందరిపై అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలి


అందరిపై అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలి


- ముస్లింల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

- రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు

- హాజరైన ఎంపీ ఆదాల, కలెక్టర్ హరి నారాయణన్


నెల్లూరు, ఏప్రిల్ 20 (ప్రజా అమరావతి): ప్రతి ఒక్కరిపై అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. 

 గురువారం సాయంత్రం నగరంలోని అనిల్ గార్డెన్స్ లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిపై అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని, ముస్లింల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. మైనార్టీ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించడంతో పాటు వారికి ముఖ్యమంత్రి ఎంతో తోడ్పాటునందిస్తున్నారన్నారు. కఠోరమైన ఉపవాస దీక్ష చేసే ముస్లిం కుటుంబాల గౌరవార్థం ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

 అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. 

 ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కనకదుర్గా భవాని, ఆర్డిఓ మలోల, తాసిల్దార్ నిర్మలానంద బాబా, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. 


Comments