*ఘనంగా మూడో విడత వైయస్సార్ ఆసరాసంబరాలు*
*అభివృద్ధి . . . సంక్షేమం ముఖ్యమంత్రికి రెండు కళ్ళు
*
*కులం, మతం, ప్రాంతం బేధం లేకుండా పథకాల లబ్ది*
: *గౌ.రాష్ట్ర విద్యుత్,అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భగనుల శాఖ మాత్యులు*
*ముఖ్యమంత్రి గారి చొరవతో మంత్రివర్యుల ఆధ్వర్యంలో జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి*
: .జడ్పీ చైర్మన్*
*పేద మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోకూడదనే ఉద్దేశ్యం తో వై.యస్.ఆర్ ఆసరా పథకాన్ని రూపొందించిన ముఖ్యమంత్రి*
: *జిల్లా కలెక్టర్*
సదుం, ఏప్రిల్ 6 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రజల అభివృద్ధి మరియు వారి సంక్షేమం గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు అని గౌ. రాష్ట్ర విద్యుత్,అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక భూగర్భగనుల శాఖ మాత్యులుడా.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు...
3 వ విడత వై.యస్.ఆర్ ఆసరా కార్యక్రమ లబ్ధిని మహిళలకు అందించడంలో భాగంగా గురువారం పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం నందు సమావేశం ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి మంత్రి వర్యులతో పాటు జెడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్, తంబళ్ళపల్లి శాసన సభ్యులు పెద్దిరెడ్డి ద్వారక నాధ్ రెడ్డి, టిటిడి పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
వీరితో పాటుడిఆర్డిఏ పిడి తులసి, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, సదుం ఎంపీపీ ఎల్లప్ప, జెడ్పిటిసి సోమ శేఖర్ రెడ్డి , తహసీల్దార్ చంద్ర శేఖర్, ఎంపిడిఓ వరప్రసాద్, వైస్ ఎంపిపి లు అమరావతి, ధనుoజయ రెడ్డి, నాయకులు పెద్దిరెడ్డి, జింకా చలపతి, జయచంద్రారెడ్డి, సింగల్ విండో చైర్మన్ తిమ్మా రెడ్డి, సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
*ఈ సమావేశం లో గౌ.మంత్రివర్యులుమాట్లాడుతూ..*
రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నారని, ఇచ్చిన హామీలను 98.44 శాతం పూర్తి చేసిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కుతుందని తెలిపారు. పథకాల లబ్ధిని చేకూర్చడంలో కులం, మతం, పార్టీ, ప్రాంతం అనే విభేదాలను పక్కనపెట్టి పేదరికమే కొలమానంగా తీసుకోవడం జరిగిందని తెలిపారు. విద్యా రంగంలో పలు సంస్కరణలు తీసుకు వచ్చారని, ఇందులో భాగంగా నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక సదుపాయాలను కల్పించడం జరిగిందని, దీనికి తోడు ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యాభ్యాసం చేసే విధంగా అడుగులు వేశారని, దీని ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు పోటీ ని ధైర్యం మరియు విజ్ఞానం తో ధీటుగా ఎదుర్కొనే విధంగా ఉన్నారన్నారు. తల్లిదండ్రులకు వారి పిల్లల చదువులు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యతో పాటు వైద్య రంగంలో కూడా పలు సంస్కరణలు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా రాష్ట్రం లోని 26 జిల్లాల్లో మెడికల్ కాలేజీ లను మంజూరు చేయడం జరిగిందని, వీటిని నాడు- నేడు ద్వారా అభివృద్ధి చేయడం జరిగిందని, అంతేకాక అవసరమైన 40 వేల మంది డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, తదితర సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా 3,255 రకాల జబ్బులకు ఉచితంగా చికిత్స అందించడం జరుగుతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా కరోనా కాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో పశ్చిమ ప్రాంతం లో నీటి సమస్య తీర్చడం కొరకు మూడు రిజర్వాయర్ ల నిర్మాణం చేపట్టడం జరుగుతున్నదని తెలిపారు. ప్రతి ప్రాంతానికి నీటి సమస్య లేకుండా 20 వేల లీటర్ ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ లను నిర్మించి ప్రతి ఇంటికి నీటి కుళాయి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాకు రూ. 2400 కోట్లతో ముఖ్యమంత్రి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను మంజూరు చేసి టెండర్ లను కూడా పిలవడం జరిగిందని, ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా నీటిని అందించే కార్యక్రమం చేయడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లాలో దేవాలయాలను అభివృద్ధి చేయడం జరుగుతున్నదని, మైనారిటీ సోదరులకు షాదీ మహల్ ల అభివృద్ధి కొరకు జిల్లా కలెక్టర్ ద్వారా రూ.6.5 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
*గౌ.జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ...* ముఖ్యమంత్రి గారి చొరవతో మంత్రివర్యుల ఆధ్వర్యంలో జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో భాగంగా గ్రామాలకు సి సి రోడ్లు, త్రాగునీటి వసతి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
*జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...* రాష్ట్రం లోని పేద మహిళలు అప్పుల ఊబిలో కూరుకు పోకూదడనే ఉద్దేశ్యంతో గత సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎస్ హెచ్ జి సంఘాల్లో సంఘ సభ్యులకు నిల్వ ఉన్న బ్యాంకు రుణాలను నాలుగు విడతల్లో చెల్లించడం జరుగుతుందని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగిందనన్నారు. ఇందులో భాగంగా వై.యస్.ఆర్ ఆసరా కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగిందని, 3 విడతల్లో మహిళా సంఘాల సభ్యులకు లబ్ది చేకూర్చడం జరిగిందని, 2024 నాటికి నాలుగవ విడత లబ్ధిని కూడా జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా అందే లబ్దిని మహిళామణులు సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబాన్ని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేయాలని తెలిపారు.
*గౌ.తంబళ్ళపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ...* అన్నివర్గాలసంక్షేమానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతున్నదన్నారు. మా కుటుంబం మొత్తం పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటుందన్నారు.
*టిటిడి పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ...* పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని, దీనికి మంత్రివర్యులు మరియు రాజంపేట ఎం పి పి.వి. మిథున్ రెడ్డి గారు ఎంతో కృషి చేసారని తెలిపారు.
ఈ కార్యక్రమం మొదటజ్యోతి ప్రజ్వలన తో ప్రారంభం కాగా.. దివంగత మహానేత డాక్టర్ వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అతిధులు పూలమాలవేసి నివాళులర్పించారు. డిఆర్డిఏ, స్త్రీ శిశు సంక్షేమ శాఖచే ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మెగా చెక్కు పంపిణీకి సదుం మండలానికి సంబంధించిన 746 స్వయం సహాయక సంఘాలకు చెందిన 6,531 మందికి రూ. 8.23 కోట్ల చెక్కు ను గౌ.రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర, సాంకేతిక భూగర్భ గనుల శాఖ మాత్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్, తంబళ్ళపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాధ్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు పోకల అశోక్ కుమార్ లతో కలసి మహిళా లబ్దిదారులకు అందజేశారు.
addComments
Post a Comment