మన్యం మొబైల్ టవర్స్ కి *నీతి అయోగ్ ప్రశంస*
పార్వతీపురం, ఏప్రిల్ 21 (ప్రజా అమరావతి): పార్వతీపురం మన్యం జిల్లాలో టవర్స్ ఏర్పాటుపై *నీతి అయోగ్ ట్వీట్ చేసి ప్రశంసించింది* . పార్వతీపురం మన్యం జిల్లాలో సుదూర మారుమూల గ్రామాల ప్రజలకు మొబైల్ కనెక్టివిటీ సమస్యల పరిష్కారంకు (to resolve mobile connectivity issues for its citizens) అంటూ నీతి అయోగ్ ట్వీట్ చేసింది. దీనిని దాదాపు ఏడు వేల మంది దీనిని చూసారు (వ్యూస్). పార్వతీపురం మన్యం జిల్లాలో టవర్స్ ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పెద్ద ఎత్తున చొరవ చూపడం, ఇప్పటికే జియో ఐదు టవర్ల నుండి సిగ్నల్స్ విడుదల చేయడం జరిగింది. ఎయిర్ టెల్ 9 టవర్ల నుండి సిగ్నల్స్ విడుదల చేసింది. జియో, ఎయిర్ టెల్, బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థలు కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ ఆబ్లిగేషన్ ఫండింగ్ క్రింద మంజూరు చేసిన టవర్లను నిర్మిస్తున్న సంగతి విదితమే. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
addComments
Post a Comment