*ఎస్.సి.,ఎస్టీ కంపొనెంట్ చట్ట సవరణకు ఆరు మాసాల్లో ప్రభుత్వానికి నివేదిక
*
*రాష్ట్ర స్థాయి కమిటీ చైర్మన్ & ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం)రాజన్న దొర పీడిక*
అమరావతి, ఏప్రిల్ 24 (ప్రజా అమరావతి): ఎస్.సి., ఎస్టీ కంపొనెంట్ చట్టం-2023 రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్థినెన్సు త్వరలో చట్ట రూపం దాల్చనున్న నేపథ్యంలో చట్ట సవరణకై రాష్ట్ర స్థాయి కమిటీ తగిన సూచనలు, సలహాల నివేదికను ఆరు మాసాల్లో ప్రభుత్వానికి అందజేయాల్సి ఉందని రాష్ట్ర స్థాయి కమిటీ చైర్మన్ మరియు ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) రాజన్న దొర పీడిక పేర్కొన్నారు. సోమవారం వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆయన అద్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కమిటీ చైర్మన్ రాజన్న దొర పీడిక మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్.సి.,ఎస్టీల అభ్యున్నతిని కాంక్షిస్తూ పదేళ్ల కాలానికి రూపొందించబడిన ఆంధ్రప్రదేశ్ ఎస్.సి., ఎస్.టి.సబ్ ప్లాన్ చట్టం-2013 ఈ ఏడాది జనవరి 24 వ తేదీతో ముగియడం జరిగిందన్నారు. దీని స్థానంలో ఎస్.సి., ఎస్టీ కంపొనెంట్ చట్టం-2023 రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థినెన్సును ఈ ఏడాది జనవరి లో జారీచేయడం జరిగిందన్నారు. ఆబిల్లును రాష్ట్ర శాసన సభ, రాష్ట్ర శాసన మండలి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర గవర్నర్ ఆమోదానికి పంపడం జరిగిందన్నారు. రాష్ట్ర గవర్నర్ కూడా ఆ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగిందని, సవరించిన చట్టం నోటిఫికేన్ జారీ ప్రక్రియలో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎస్.సి., ఎస్టీ కంపొనెంట్ చట్టం-2023 ను మరింత మెరుగ్గా రూపొందించేందుకు అవసరమైన సూచనలు, సలహాలతో ప్రభుత్వానికి నివేదికను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 11 న జిఓఎంఎస్ నెం.91 ను జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీ రానున్న ఆరు మాసాల్లో ఎస్.సి., ఎస్టీ కంపొనెంట్ చట్టం-2023 సవరణకు అవసరమైన సూచనలు,సలహాలతో నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ కమిటీ పలు మార్లు సభ్యులతో సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీలను మరింతగా అభ్యున్నతి పథంలో నడిపేందుకు అవసరమైన సూచనలు, సలహాలతో సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కమిటీలోని సభ్యులైన పార్లమెంట్ సభ్యులు డా.మద్దిల గురుమూర్తి, శాసన సభ్యులు ఉన్నమట్ల ఎలీజా, డా.మొండితోక జగన్మోహనరావు, కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి తదితరులు ఈ సమావేశాంలో పాల్గొని ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ ల పరిస్థితులు, వారి జీవన ప్రమాణాలపై సుదీర్ఝంగా చర్చించారు. గత పదేళ్ల కాలంలో వారి సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు, వాటి వెచ్చింపులు, వాటి వల్ల ఎస్సీ, ఎస్టీలకు లకు ఒనగూరే ప్రయోజనాలపై సభ్యులు చర్చించడం జరిగింది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభ్యున్నతికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ పరంగా అమలు చేస్తున్న పలు పథకాల అమలు తీరును సభ్యులు చర్చించి, వారి అభ్యున్నతికి అవసరమైన తగు సూచనలు, సలహాలను చైర్మన్ దృష్టికి తీసుకు వచ్చారు, ఎస్.సి., ఎస్టీ కంపొనెంట్ చట్టం-2023 సవరణకు అవసరమైన పలు సూచనలు, సలహాలను అందజేశారు.
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ జి.జయలక్ష్మీ, సంచాలకులు విజయకృష్ణన్, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు మురళీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment