అసంక్రమిత వ్యాధుల సర్వే పక్కాగా గడువులోపు పూర్తి చేయాలి*
*సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన పై దృష్టి పెట్టండి: జిల్లా కలెక్టర్*
పుట్టపర్తి, ఏప్రిల్ 27 (ప్రజా అమరావతి): గ్రామీణ ప్రాంతంలో పనిచేసే పిహెచ్సి డాక్టర్లు,వైద్య సిబ్బంది నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే డాక్టర్లను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలో వైద్య శాఖ వివిధ అంశాలపై అమల తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్చువల్ విధానం ద్వారా సంబంధితఎంపీడీవోలకు జిల్లా కలెక్టర్ సూచనలు చేశారుఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి ఎస్ వి కృష్ణారెడ్డి, సిపిఓ విజయ్ కుమార్, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు శ్రద్ధ చూపాలని , సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన ధ్యేయంగా పనిచేయాలని తెలిపారు అసంక్రమిత, సంక్రమిత వ్యాధుల సర్వే వేగవంతం చేయాలనీ, వైద్య రంగంలోని అంశాలలో పురోగతి మెరుగుపడాలి అని, వైద్య అధికారులు వారికి సంబంధించిన హెల్త్ పారామీటర్ లలో లక్ష్యాలు అంది పుచ్చుకోవాలి అని అన్నారు. డీఎంహెచ్వో క్షేత్రస్థాయిలో పర్యటించాలని తెలిపారు. డిప్యూటీ డిఎంహెచ్వో, మరియు వివిధ ప్రోగ్రాం ఆఫీసర్లు ఎప్పటికప్పుడు సంబంధిత ఎంపీడీవోలతోనూ వైద్య శాఖలో వివిధ సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించుకోవాలని తెలిపారు. సోమవారం లోపుఅందరు ఎంపీడీవోలు, సహకారం తీసుకొని డాక్టర్లు, NCD-CD సర్వే కార్యక్రమం అమలపై సచివాలయం సిబ్బందితో సమీక్షించి నమోదు కార్యక్రమం వేగవంతం చెయ్యాలని తెలిపారు. సస్పెక్టెడ్ కేసులను పరిశీలించి MO యాప్ నందు అప్లోడ్ చేయాలని వైద్యులు హెచ్చరించారు. వైద్యులకు సేవా గుణం కలిగి ఉండాలని కమర్షియల్ తో పని చేయకూడదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లను హెచ్చరించారు.
ప్రతి రోజూ RCH PORTAL ని దర్శించి
ఏ ఒక్కటీ పెండింగ్ లేకుండా మధ్యాహ్నం1.00 గంట క్లియర్ చేయవలెను ANC-TESTSపెండింగ్ లేకుండా చేయాలి. ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ లో రక్తపోటు, మధుమేహం ఫోర్ పర్ఫామెన్స్ ఉందని దానిని ఇంప్రూవ్ చేసుకో బాధ్యత వైద్య సిబ్బందిపై ఉన్నదని ఆదేశించారు. హౌస్ టు హౌస్ ఏఎన్ఎం చేసే సర్వే రిపోర్టు ప్రతిరోజు డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో నాకు నివేదికలు అందజేయాలని తెలిపారు. వివిధ ప్రామాణికులలో వెనకబడి ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కనగానపల్లి, లేపాక్షి, చిలమత్తూరు దుర్గా నగర్, కదిరేపల్లి, మడకశిర, వెనకబడి ఉన్నాయని వాటిని 15 రోజులలోపల సర్వే 90% చేయాలని తెలిపారు. వారంలోపు ఎన్ ఎస్ గేట్, కొండాపురం, రెడ్డిపల్లి, ఆగలి, పరిగి తాడిమర్రి, కోక్కింటి, సి డి ఎన్ సి డి సర్వే నమోదు పక్రియ 90 శాతం పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో లు, డాక్టర్ నివేదిత, డాక్టర్ మంజువాణి, డాక్టర్ కల్పనా సాల్మన్, డాక్టర్ అన్నావుద్దీన్, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment