మైనింగ్ రంగంలో సీఎం శ్రీ వైయస్ జగన్ విప్లవాత్మక మార్పులు.


-  మైనింగ్ రంగంలో సీఎం శ్రీ వైయస్ జగన్ విప్లవాత్మక మార్పులు


- పాదర్శక విధానాలతో మైనింగ్ రంగంలో సంస్కరణలు

- 2018-19లో వార్షిక మైనింగ్ ఆదాయం: రూ.1950 కోట్లు మాత్రమే

- 2022-23లో వార్షిక మైనింగ్ ఆదాయం:  రూ. 4756 కోట్లు

- రాష్ట్రంలో 13 రీజనల్ స్వ్కాడ్ లతో అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం

- 2014-19 వరకు అక్రమ మైనింగ్ పై నమోదైన కేసులు : 424

- 2019-23 వరకు అక్రమ మైనింగ్ మూడేళ్ళలోనే నమోదైన కేసులు : 786

- 2014-19 వరకు గ్రావెల్ తాత్కాలిక అనుమతుల ద్వారా వచ్చిన ఆదాయం: రూ. 12.62 కోట్లు

- 2019-23 వరకు గ్రావెల్ తాత్కాలిక అనుమతుల ద్వారా మూడేళ్ళలోనే వచ్చిన ఆదాయం: రూ.65.24 కోట్లు

- లైటరైట్ లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి బినామీల అక్రమాలపై చర్యలు

- లైమ్ స్టోన్ మైనింగ్ లో మాజీ ఎమ్మెల్యే యరపతినేని అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది

- చిత్తూరు జిల్లా కుప్పంలోనూ మైనింగ్ అక్రమాలపై మహాచెక్ ద్వారా తనిఖీలు నిర్వహించాం

- దాదాపు రూ.5 కోట్ల విలువైన గ్రానైట్ ను సీజ్ చేశాం.

- చిత్తూరు జిల్లాలో 2014-19 వరకు అక్రమ మైనింగ్ పై కేసులు : 38

- 2019-23 వరకు అక్రమ మైనింగ్ పై నమోదైన కేసులు: 96 

- చిత్తూరు జిల్లా పాలెంపల్లి మైనింగ్ ఏరియాలపైన కొన్ని పత్రికల్లో తప్పుడు రాతలు

- కొత్త విధానం వచ్చిన తరువాత మైనింగ్ ప్రారంభించని ఏరియాలకు దాఖలు చేసిన దరఖాస్తులు రద్దయ్యాయి

- తిరిగి ఈ-ఆక్షన్ లో ఆసక్తి ఉన్న వారు లీజుల కోసం బిడ్ లు వేయాలి

- ఇటీవల జరిగిన ఈ-ఆక్షన్ లో సదరు ఏరియాలకు ఎవరూ బిడ్ లు వేయలేదు

- పత్రికల్లో దీనిని వక్రీకరిస్తూ తప్పుడు కథనాలు రాయించారు

- వాస్తవాలను మీడియా ముందు ఉంచేందుకే ఈ ప్రెస్ కాన్ఫెరెన్స్

: గనులశాఖ సంచాలకులు శ్రీ విజి వెంకటరెడ్డి


విజయవాడ (ప్రజా అమరావతి):

1) ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్, గనులశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల నేతృత్వంలో రాష్ట్రంలో మైనింగ్ లో అనేక విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారు. గనుల శాఖలో పలు సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాదర్శకత, జవాబుదారీతనం, అవినీతిరహిత విధానంకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మైనింగ్ రెవెన్యూను పెంచుకోవడం, దీనివల్ల రాష్ట్రంలోని పరిశ్రమలకు అవసరమైన ఖనిజాలను అందించడం, మైనింగ్ రంగంపై ఆదారపడిన యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. 

2) ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ముందుచూపుతో ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఏ మేరకు మైనింగ్ రెవెన్యూలో ప్రగతి సాధ్యపడిందో అర్థమవుతుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వార్షిక మైనింగ్ రెవెన్యూ రూ.1950 కోట్లు కాగా, ఈ ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, అమలు చేసిన ఉత్తమ విధానాల ఫలితంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలలో మైనింగ్ రెవెన్యూ రూ.4756 కోట్లకు పెరిగింది. 

3) రాష్ట్రంలో గ్రావెల్, రోడ్ మెటల్ మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయని కొందరు పనికట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. 2014-19 వరకు రాష్ట్రంలో 41.62 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కు తాత్కాలిక అనుమతులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ.12.62 కోట్ల మైనింగ్ ఆదాయం లభించింది. 2019-22 వరకు రాష్ట్రంలో 1.25 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ కు తాత్కాలిక అనుమతులు ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 65.24 కోట్ల మైనింగ్ ఆదాయం లభించింది. అంటే గత ప్రభుత్వంలో అయిదేళ్ళలో వచ్చిన ఆదాయం కంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మూడేళ్ళలోనే నాలుగు రెట్లు అధికంగా ఆదాయాన్ని ఆర్జించింది. 

4) రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గతంలో ఇష్టారాజ్యంగా అక్రమ మైనింగ్, రవాణా జరుగుతున్నా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు సీఎం శ్రీ వైయస్ జగన్ గారు 13 జిల్లా విజిలెన్స్ స్వ్కాడ్ లను ఏర్పాటు చేశారు. అక్రమ మైనింగ్, రవాణాను అరికట్టేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 5994599 ను కూడా ఏర్పాటు చేశారు.  2014-19 వరకు అక్రమ మైనింగ్ పై అయిదేళ్ళ కాలంలో నమోదైన కేసులు 424 అయితే, 2019-22 వరకు అంటే కేవలం మూడేళ్ళ కాలంలోనే అక్రమ మైనింగ్ నమోదైన కేసులు 643. అంటే ఈ ప్రభుత్వం అక్రమ మైనింగ్ పై ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 

5) చిత్తూరు జిల్లా కుప్పం అటవీ భూములు, ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్ ను పూర్తి స్థాయిలో గనుల శాఖ నియంత్రించింది.  2019 సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో గనులశాఖ నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 4787 క్యూబిక్ మీటర్ల పరిమాణం గల 555 గ్రానైట్ బ్లాక్ లను సీజ్ చేశాం.  అలాగే క్వారీయింగ్ యంత్రాలు, ఇతర వాహనాలను సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు స్వాధీనం చేశాం. అక్రమ క్వారీయింగ్ కు సంబందించి సీజ్ చేసిన వాటి విలువే దాదాపు రూ.5 కోట్లు ఉంటుంది. అలాగే అటవీ శాఖ భూముల్లో మైనింగ్ పై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గనులశాఖ సహాయ సంచాలకులు ఇతర అధికారుల బృందం ఈ ప్రాంతంలోని సర్వే నెంబరు 104, 213, సర్వేనెంబర్ 124 /పి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిందని అన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ కొందరు వ్యక్తులు అక్రమంగా మైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారని, 104 సర్వే నెంబర్ లో 88 కలర్ గ్రానైట్ బ్లాక్ లు, 213 సర్వేనెంబర్ లో 13 బ్లాక్స్ ను, 124/ సర్వేనెంబర్ లో 14 కలర్ గ్రానైట్ బ్లాక్ లను సీజ్ చేయడం జరిగింది. మైనింగ్ అక్రమాలపై  4 బృందాలతో మహాచెక్ లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 40 గ్రానైట్ దిమ్మెలు, 06 కంప్రెషర్లను 02 హిటాచీ యంత్రాలను లను సీజ్ చేయడం జరిగింది. ద్రావిడ విశ్వ విద్యాలయం పరిధిలోని భూముల్లో అక్రమ మైనింగ్ పై దాడులు చేసి 131 గ్రానైట్ బ్లాకులను సీజ్ చేశామని అన్నారు. 

6) చిత్తూరు జిల్లాలో 2014-19 వరకు అక్రమ మైనింగ్ పై కేవలం 38 కేసులు నమోదు చేయగా, 2019-23 వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం వల్ల 96  కేసులు నమోదు చేయడం జరిగింది. 

7) తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు 2014-19 మద్య కాలంలో లేటరైట్ మైనింగ్ లో తన బినామీల ద్వారా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ కు పాల్పడ్డాడు. మైనింగ్ క్వారీ సరిహద్దులను అతిక్రమించడం, నిర్ధేశిత నిల్వల కన్నా అధికంగా క్వారీయింగ్ చేయడం, అక్రమంగా లేటరైట్ ను రవాణా చేయడం వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. అయ్యన్నపాత్రుడి బినామీలు పి.దేముడు, ఎస్. భవానీ, కె.లోవరాజు అనే వ్యక్తులు లేటరైట్ మైనింగ్ లో అక్రమాలకు పాల్పడ్డారు. పి. దేముడు అనే లీజుదారుడు తన క్వారీ పరిధిని అతిక్రమించి, అనధికారికంగా 55,500 ఎంటిల లేటరైట్ ఖనిజాన్ని తవ్వి, రవాణా చేసినట్లు గుర్తించడం జరిగింది. ఇందుకు గానూ లీజుదారుడికి రూ.1,57,62,500 జరిమానా విధిస్తూ గనులశాఖ డిమాండ్ నోట్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మరో లీజుదారు ఎస్.భవానీ కూడా నిబంధనలను అతిక్రమించి క్వారీ పరిధిని దాటి 18,942.24 MTs లేటరైట్ ఖనిజాన్ని తవ్వి, రవాణా చేశారు. దీనితో పాటు అనుమతించిన దానిని మించి 1,28,53.20 MTs లేటరైట్ ను రవాణా చేసినట్లు నిర్ధారించడం జరిగింది. దీనిపై  సదరు లీజుదారుకి రూ. 11,06,80,624/- జరిమానా విధిస్తూ డిమాండ్ నోటీస్ జారీ చేశాం.  అప్పటి మంత్రి అయ్యన్నపాత్రుడి బినామీగా ఉన్న మరో లీజుదారు కె.లోవరాజు కూడా లీజు క్వారీ పరిధిని అతిక్రమించి బయటి ప్రాంతంలో 50,169 ఎంటిల లేటరైట్ ఖనిజాన్ని అక్రమ రవాణా చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఇందుకు గానూ లీజుదారుకు రూ. 8,49,32,995/- జరిమానా విధించడం జరిగింది. 

8) ఎపిలో దాదాపు 1200 ఏరియాలు అంటే సుమారు 6 వేల హెక్టార్ లలోని చిన్నతరహా ఖనిజ నిల్వలకు ఈ - ఆక్షన్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. గతంలో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అనే విధానం ఉండేదని, దీనివల్ల మైనింగ్ రంగంలోకి రావాలని భావించే వారికి అవకాశం లేకుండా పోయింది. దీనిలో మార్పులు తీసుకువస్తూ మైనర్ మినరల్స్ మైనింగ్ లో ఈ-ఆక్షన్ విధానంనులో అమలు లోకి తేవడం వల్ల అందరికీ అవకాశాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఖనిజ సంపద ఎక్కడ ఉందో లీజుదారులే గుర్తించి, దానికి రెవెన్యూ డిపార్ట్ మెంట్ నుంచి అవసరమైన ఎన్ఓసిలు, తీసుకురావాల్సి వచ్చేది. కొత్త విధానం వల్ల నేరుగా గనుల శాఖ ఎక్కడ ఏఏ ఖనిజ సంపద ఉందో పొటెన్షియాలిటీ ఏరియాలను గుర్తించి, వాటికి ఈ-ఆక్షన్ నిర్వహిస్తోంది. అలాగే వాటికి అవసరమైన అనుమతులకు కూడా గనులశాఖ పూర్తి సహకారాన్ని అందిస్తోంది. డిజిపిఎ సర్వే సైతం చేసి, ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది. 

9) గుర్తించిన మైనర్ మినరల్స్ కు సంబంధించి లీజుల జారీలో ఎటువంటి జాప్యం, పక్షపాతం లేకుండా సులభతరమైన విధానంను అమలులోకి తీసుకువచ్చాం. దీనివల్ల ఎక్కువ ఏరియాల్లో మైనింగ్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయి. ఫలితంగా ఖనిజ ఆధారిత పరిశ్రమలకు ముడివనరులు అందుబాటులోకి వస్తాయి. ఈ-ఆక్షన్ కోసం అవసరమైన టెండరు పత్రాలు ఈ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ లో ఉంచుతున్నాం. సదరు ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ నుంచి టెండర్ డాక్యుమెంట్లను పొందవచ్చు.  పోర్టల్ లో పొందుపరిచిన లీజులకు సంబంధించి ఈ-ఆక్షన్ లో ఎక్కువ మత్తానికి ఎవరైతే కోట్ చేస్తారో సదరు బిడ్డర్ (ప్రిఫర్డ్ బిడ్డర్) తాను కోట్ చేసిన మొత్తాన్ని 15 రోజుల్లో గనులశాఖకు చెల్లించాల్సి ఉంటుంది.  ఆ మొత్తాన్ని చెల్లించిన తక్షణం వారికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేస్తున్నాం. ప్రిఫర్డ్ బిడ్డర్ తాను కోట్ చేసిన క్వారీకి మైనింగ్ ప్లాన్, ఇసి, సిఎఫ్ఇ సమర్పించిన వెంటనే లీజులు మంజూరు అవుతాయి. 

10) ఇంత సులభరతమైన విధానంను తీసుకువచ్చిన తరువాత కూడా ఈ ప్రభుత్వంపై బురదచల్లేలా కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాలు రాస్తున్నారు. ఉదాహరణకు చిత్తూరుజిల్లా పాలెంపల్లి గ్రామ పరిధిలో గ్రానైట్ లీజులకు 2018లో ఇద్దరు వ్యక్తులు దరఖాస్తు చేసుకుని, అవసరమైన అన్ని పత్రాలను మైనింగ్ కార్యాలయంకు సమర్పించకపోవడం వల్ల మైనింగ్ అనుమతులు పొందలేక పోయారు. కొత్త విధానం అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ కోసం దరఖాస్తు చేసుకుని నిర్ణీత కాలంలో మైనింగ్ ప్రారంభించని ఏరియాలకు గతంలో సమర్పించిన లీజు దరఖాస్తులు రద్దు అయ్యాయి. ఈ లీజు ఏరియాలను ఈ-ఆక్షన్ ద్వారా ఆసక్తి ఉన్న వారికి కేటాయిస్తున్నాం. దానిపైన కూడా తప్పుడు వార్తలు ప్రచురించారు. ఇప్పుడు ఆదే ఏరియాలో లీజుల కోసం ఈ-ఆక్షన్ నిర్వహిస్తే గతంలో దరఖాస్తు చేసిన వారు కనీసం ఆక్షన్ లో కూడా పాల్గొనలేదు. ఈ-ఆక్షన్ లో ఎవరైనా సరే స్వేచ్ఛగా పాల్గొనే అవకాశం ఉంది. కానీ సదరు ఏరియాలకు గతంలో దరఖాస్తు చేసిన వారు తమకు ఆస్తకి ఉంటే బిడ్ దాఖలు చేసి ఉండేవారు. కానీ ఎవరూ దానికి బిడ్ వేయలేదంటే... దానికి కూడా తప్పుడు అర్థాలు తీసి, అవాస్తవాలతో కూడిన కథనాలను కొన్ని పత్రికలు ప్రచురించడం బాధాకరం. 

11) గతంలో ముందు దరఖాస్తు చేసుకున్న వారికి ముందు అనుమతి అనే విధానంను అడ్డం పెట్టుకుని పలువురు మైనింగ్ లీజులకు దరఖాస్తు చేసుకుని ఏరియాలను బ్లాక్ చేశారు. వాటిల్లో మైనింగ్ చేయకుండా, కొత్త వారు ఈ రంగంలోకి రాకుండా ఆటంకాలు కల్పించారు. అధిక మొత్తాలకు తాము దరఖాస్తు చేసుకుని రిజర్వు చేసుకున్న లీజులను అమ్ముకునేవారు. ఇప్పుడు ఆ విధానం లేకపోవడం, పూర్తి పారదర్శకంగా ఈ-ఆక్షన్ లోనే లీజులు జారీ అవుతుండటంను వారు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే లేనిపోని అవాస్తవాలను పోగు చేసి ప్రభుత్వంపై వ్యతిరేక భావజాలం కలిగిన పత్రికల ద్వారా తప్పుడు కథనాలను రాయిస్తున్నారు. దీనిలో వాస్తవాలను మీడియా ముందు ఉంచేందుకే ఈ ప్రెస్ మీట్ నిర్వహించాం. 


2019-23 వరకు తనిఖీలు- జరిమానాల విధింపు వివరాలు:

1. శ్రీకాకుళం జిల్లా: 6 గ్రానైట్ క్వారీలు, 23 పాలిషింగ్ యూనిట్లలో తనిఖీలు: సుమారు రూ.40 కోట్ల జరిమానా విధింపు

2. విశాఖ జిల్లా: 17 రోడ్ మెటల్ క్వారీలు, 20 క్రషర్లపై తనిఖీలు: సుమారు 100 కోట్ల జరిమానా విధింపు

3. కృష్ణాజిల్లా: కొండపావులూరు, పోలవరం కెనాల్స్, కొత్తూరు తాడేపల్లి ప్రాంతాల్లో గ్రావెల్ తవ్వకాలపై తనిఖీలు, 76 కేసులు నమోదు, రూ.100 కోట్ల జరిమానా విధింపు.

4. ప్రకాశం జిల్లా: 155 గ్రానైట్ క్వారీల్లో తనిఖీలు: రూ.2 వేల కోట్ల జరిమానా

5. గుంటూరు జిల్లా: 10 రోడ్ మెటల్ క్వారీలు: రూ.30 కోట్ల జరిమానా

6. నెల్లూరు జిల్లా: 20 సిలికాశాండ్ క్వారీల్లో తనిఖీలు: రూ.100 కోట్ల జరిమానా

7. చిత్తూరు జిల్లా: 96 క్వారీల్లో తనిఖీలు నిర్వహించి, రూ.315 కోట్ల జరిమానా విధింపు.

Comments