సకాలంలో స్పందన అర్జీలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి.

 *సకాలంలో స్పందన అర్జీలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి*



*: జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 10 (ప్రజా అమరావతి):


*స్పందన అర్జీలను ఆలస్యం కాకుండా సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. బసంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి .. అర్జీలను స్వీకరించడం జరిగింది.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నాణ్యత కలిగిన పరిష్కారం అందించేలా చూడాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, పెండింగ్ ఉన్న ఆర్జీలను ఎలాంటి ఆలస్యం లేకుండా పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.*


*సోమవారం జరిగిన ప్రజా స్పందన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ సమస్యలతో కూడిన అర్జీలను సమర్పించారు. ఇందులో కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.*


1. ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లి గ్రామ నివాసి శాంతయ్యకు చెందిన సర్వే నంబర్ 110/3 లో 4.82 సెంట్ల భూమిని వంశపార్యంపరంగా తనకు ఇచ్చారని, ఆ భూమిని ఇతరులు కబ్జా చేసి అమ్మారని, ఈ విషయంలో తనకు న్యాయం చేయవలసిందిగా కోరారు.


2. గోరంట్ల మండలానికి చెందిన వాండ్లపల్లి గ్రామ నివాసి అయిన రేష్మ భాను జగనన్న కాలనీ లేఔట్లలో ఇంటి నిర్మాణం చేపట్టిందని, గత 11 నెలలుగా ఎలాంటి బిల్లులో మంజూరు కాలేదని పేర్కొంటూ వినతి సమర్పించింది.


3. కొత్తచెరువు మందలంపల్లి గ్రామానికి చెందిన మస్తాన్ రెడ్డికి సంబంధించి సర్వేనెంబర్ 7/4 లో 9.35 సెంట్ల భూమిలో ఇతరులు రాస్తాను ఏర్పాటు చేసుకున్నారని, ఈ విషయమై సర్వే చేయవలసిందిగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని పేర్కొంటూ అర్జీని సమర్పించాడు. 


4. సోమందేపల్లి గ్రామ సచివాలయం-2లో రెగ్యులర్ విఆర్వో లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నూతనంగా వీఆర్వోను నియమించాలని ఆనందప్ప, గంగాధర్, వెంకటేష్ తదితరులు వినతిని సమర్పించారు.


5. హిందూపురంలోని ఎస్.సడ్లపల్లి ఎన్టీఆర్ కాలనీలో  ఏఎన్ఎం పోస్ట్ చాలాకాలంగా ఖాళీగా ఉందని, ఇక్కడ ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు లక్ష్మీదేవి, కవిత, నరేంద్రబాబు, శంకరప్ప తదితరులు అర్జీని సమర్పించారు. 



Comments