నిరుపేదలైన ఎస్సి,ఎస్టిలకు భూ పంపిణీ చేయాలి.

 నిరుపేదలైన ఎస్సి,ఎస్టిలకు భూ పంపిణీ చేయాలి.


పల్నాడు జిల్లా  కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా.... కలెక్టర్ కు వినతి.


  నర్సరావు పేట (ప్రజా అమరావతి);మండలంలోని ప్రభుత్వ భూములనునిరుపేదలైన ఎస్టీ,ఎస్సిలకు సాగు చేసుకునేందుకు 2 ఎకరాల చొప్పున ప్రభుత్వ భూమి ఇచ్చి ఆర్థికంగా పులోపేతం చేయాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక  రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్,గిరిజన విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు కేతావతు పాండు నాయక్ అన్నారు. సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక యడ్లపాడు మండల అధ్యక్షులు వి.శ్రీనివాస్ నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ వంకాయలపాడు, కారుచోల, కొండవీడు తోపాటు ఆయా గ్రామీణ ప్రాంతాల్లో అన్యాక్రాంతమయ్యాయి. భూములంతా ఆయా రాజకీయ పార్టీ నాయకుల చేతుల్లో ఉన్నాయని వాటి పైనా విచారణ చేపట్టి భూముల లెక్కలు నీగ్గు  తేల్చాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక  నాయకులు డిమాండ్ చేశారు. కొంతమంది రాజకీయ నేతలు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేల కోట్ల రూపాయలకు భూములు అమ్ముతా ఉంటే రెవిన్యూ అధికారులు పట్టీ పట్టనట్లుగా వివరిస్తున్నారు. వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ రామాంజనేయులు చైర్మన్ అధ్యక్షతన సుమారు 150 ఎకరాలు ప్రభుత్వ మిగులు భూములు ఉన్నాయని అన్నారు. ఇంకా ఆయా గ్రామీణ రెవిన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు ఉన్నాయని  దీనిపైన రెవెన్యూ అధికారులే సమాధానం చెప్పవలసిన అవసరం ఉందన్నారు.  అనంతరం పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కు వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో  ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక  గౌరవ అధ్యక్షులు బి.చిన్న నాయక్, పట్టణ అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాసరావు,నాయకులు నాగేశ్వరరావు నాయక్ , చుండూరీ ఆనందబాబు, యమర్తి సుబ్బారావు, ఏడ్లూరి నాగేశ్వరరావు,హేమంత్ నాయక్ ,తోపాటు మహిళలు ఆయా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎస్టీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments