జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు సమాయత్తం కావాలి



మచిలీపట్నం,ఏప్రిల్ 19 (ప్రజా అమరావతి);


వచ్చే మే నెల మొదటి వారంలో ప్రారంభించనున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు సమాయత్తం కావాల


ని జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు అధికారులను ఆదేశించారు 



బుధవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీమతి పూనం మాలకొండయ్య  జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని వారి ఛాంబర్ నుండి పాల్గొన్నారు.



అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానంగా ప్రజల నుండి 5 ప్రభుత్వ శాఖలకు సంబంధించి అర్జీలు వస్తుంటాయన్నారు.


అందులో రెవెన్యూ, పంచాయతీరాజ్- గ్రామీణ అభివృద్ధి, మునిసిపల్ పరిపాలన-అభివృద్ధి,  పోలీసు ఆరోగ్యం కుటుంబ సంక్షేమం శాఖలకు సంబంధించి అధికంగా అర్జీలు వుంటున్నాయన్నారు. 



అర్జీలను గడువు దాటకుండా సకాలంలో పరిష్కరించాల్సి వుందన్నారు. 


 ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట మరింత  మెరుగుపడే విధంగా  సమస్యల పరిష్కారం  జరగాల్సి ఉందన్నారు. ప్రజలను సంతృప్తి పరిచే విధంగా పరిష్కార విధానం ఉండాలన్నారు.


ముఖ్యంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ గ్రామ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు సజావుగా పనిచేసే విధంగా సిబ్బందిని అన్ని విధాల చైతన్య పరచాలన్నారు.

అర్జీల పరిష్కారంలో నాణ్యత ప్రమాణాలను విధిగా పాటించాలన్నారు


వచ్చే అర్జీలలో ఏ ప్రాంతాల నుండి ఏ అంశాల పైన ఏ సమస్యల పైన ఎక్కువగా వస్తున్నాయో వాటిని  విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.



ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి డిఆర్వో ఎం వెంకటేశ్వర్లు కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శివ నారాయణ రెడ్డి, జడ్పీ సీఈవో జ్యోతిబసు తదితర అధికారులు పాల్గొన్నారు



Comments