*- ఫౌండేషన్, పార్టీ కార్యక్రమాలతో చంద్రబాబును మెప్పించిన వెనిగండ్ల
*
*- తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుకు వివరణ*
*- వెనిగండ్ల సేవా కార్యక్రమాలతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు*
*- ఎంతో ఆసక్తితో ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించిన చంద్రబాబు*
గుడివాడ, ఏప్రిల్ 15 (ప్రజా అమరావతి);: కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో కొంత కాలంగా నిర్వహిస్తున్న ఫౌండేషన్, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును వెనిగండ్ల ఫౌండేషన్, అధినేత, టీడీపీ నేత వెనిగండ్ల రాము మెప్పించారు. గత ఏడాది గుడివాడలో వెనిగండ్ల తన కార్యకలాపాలను ప్రారంభించే ముందుగానే ప్రజల అవసరాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. గుడివాడలోనే పుట్టి, ఇక్కడే పెరిగి అమెరికాలో రాణించిన వెనిగండ్లకు నియోజకవర్గ పరిస్థితులపైనా పూర్తి అవగాహన ఉంది. పేద ప్రజలందరికీ పెద్దఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు సాధ్యమైనంతగా సమస్యలను పరిష్కరించడం, పేద కుటుంబాలకు అండగా నిలబడడం, నిరుపేదలకు సాయం చేయడం వంటి లక్ష్యాలతో వెనిగండ్ల ప్రజల్లోకి వెళ్లారు. నియోజకవర్గ ప్రజలు కూడా వెనిగండ్లను గ్రాండ్ గానే రిసీవ్ చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. వెనిగండ్ల కార్యక్రమాలన్నీ సద్వినియోగమవుతుండడంతో ప్రజల ఆదరణ కూడా పెరుగుతూ వచ్చింది. మెగా జాబ్ మేళాను నిర్వహించి 1400కు పైగా ఉద్యోగాలను కల్పించి యువతకు వెనిగండ్ల మరింత దగ్గరయ్యారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించి ప్రజల దాహార్తిని తీర్చారు. ఉచిత వైద్యశిబిరాల నిర్వహణ ద్వారా నిరుపేదల ఆరోగ్యంపై మరింత దృష్టి పెంచారు. దురదృష్టవశాత్తూ ప్రమాదాల్లో గాయపడిన, మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తూ తనవంతుగా వెనిగండ్ల ఆర్థికసాయం అందిస్తూ వస్తున్నారు. పేదప్రజలను ఆదుకునే విషయంలో ఏం చేయడానికైనా వెనిగండ్ల వెనకాడడం లేదు. దీంతో వెనిగండ్లకు ప్రజల్లో విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. ఒకవైపు సేవాకార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళిన వెనిగండ్ల మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో గుడివాడ పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన వెనిగండ్లకు మద్దతుగా జనం ప్రభంజనంలా కదిలొచ్చారు. మహిళలైతే హారతులతో సాదర స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు కొన్నింటిని వెనిగండ్ల అక్కడికక్కడే పరిష్కరిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మక కార్యక్రమమైన అన్నా క్యాంటీన్లను గుడివాడలో నిర్వహిస్తూ పేదల ఆకలిని తీర్చడంలో రూ.లక్షలు ఖర్చు చేసేందుకు కూడా వెనిగండ్ల వెనకాడడం లేదు. నియోజకవర్గంలో ఇప్పటివరకు నిర్వహించిన సేవా కార్యక్రమాలన్నింటినీ గుడివాడ పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు వెనిగండ్ల వివరించడం జరిగింది. వెనిగండ్ల సేవా, పార్టీ కార్యక్రమాలపై రూపొందించిన ఫొటో ఎగ్జిబిషన్ ను చంద్రబాబు ఎంతో ఆసక్తిగా చూశారు. అలాగే గుడివాడ నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను కూడా చంద్రబాబుకు వెనిగండ్ల వివరించడం జరిగింది. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సమస్యలను కూడా చంద్రబాబు దృష్టికి వెనిగండ్ల తీసుకెళ్ళగలిగారు. మొత్తం మీద గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల నిర్వహిస్తున్న కార్యక్రమాలను చంద్రబాబు తన పర్యటనలో స్వయంగా సమీక్షించినట్టుగా ప్రచారం జరుగుతోంది.
addComments
Post a Comment