కొల్లిపర (ప్రజా అమరావతి); కొల్లిపర మండలం,
తెనాలి నియోజవర్గం మాజీ టిడిపి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ జన్మదిన వేడుకలు మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో ఎన్టీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజా చిత్రపటానికి పాలాభిషేకము మరియు కేక్ కట్ చేయడంతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ యువసేన అధ్యక్షుడు ఎన్టీఆర్ కోటిరెడ్డి మరియు పలువురు టిడిపి నేతలు ఆలపాటి రాజా కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో పలువురు నేతలు మాట్లాడుతూ రాబోయే తారవత్రిక ఎన్నికలలో తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజా ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని రాజా గెలుపు కోసం తమంత కలిసి పని చేస్తామని నియోజకవర్గంలోనూ మండలాల్లోనూ టిడిపి పార్టీ బలోపేతానికి తామెప్పుడూ సంసిద్ధంగా ఉన్నామని తెలియజేశారు కార్యక్రమంలో వేణుగోపాల్ రెడ్డి , సాంబిరెడ్డి, సుధాకర్ రెడ్డి, నీలాంబరం, సత్యానందం, బాబీ టైలర్స్ మరియు మండల టిడిపి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
addComments
Post a Comment