మత్స్యకార కుటుంబాలకు అండగా వుంటూ వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నది.

 :

నెల్లూరు (praja amaravati);

మత్స్యకార కుటుంబాలకు అండగా వుంటూ వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్,  ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు.


బుదవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు  మండలం, నేలటూరు గ్రామ సచివాలయ  పరిధిలోని నేలటూరుపాలెంలో రూ. 35  లక్షల రూపాయలతో నిర్మించిన  రక్షిత మంచినీటి సరఫరా పధకాన్ని మంత్రి శ్రీ  కాకాణి గోవర్ధన్  రెడ్డి ప్రారంభించారు. అనంతరం  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ,   వివిధ పధకాల కింద వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు.


ఈ సంధర్బంగా  మంత్రి  శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మత్స్యకార కుటుంబాలకు అండగా వుంటూ వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నదన్నారు. నేలటూరు గ్రామ సచివాలయ  పరిధిలోని నేలటూరుపాలెం గ్రామం పూర్తిగా జెన్ కో పునరావాస గ్రామంగా వున్నందున, ఈ గ్రామంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను అందించడంతో పాటు ఇళ్ల స్థలాలను కేటాయించి  వారిని వేరే ప్రాంతానికి తరలించేలా  చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  ఈ ప్రాంత తాత్కాలిక అవసరాల నిమిత్తం 35 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి సరఫరా పధకాన్ని ఈ రోజు ప్రారంభించు కోవడం జరిగిందన్నారు.    మత్స్యకారుల  సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా,  రాయితీతో డీజిల్ సబ్సిడీ,  చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అర్హత కల్గిన ప్రతి పేద కుటుంబానికి  సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంతో   రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  పనిచేస్తున్నారని, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు సంక్షేమ పధకాలు అందడంలేదని ఎక్కడా వినిపించడం లేదని మంత్రి తెలిపారు. సాంకేతిక కారణం వలన  ఎక్కడైనా సంక్షేమ ఫలాలు అందకపోతే వారికి అందించడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు.  

మంత్రి వెంట   ఎంపిపి శ్రీమతి సుగుణమ్మ, వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments