నెల్లూరు ఏప్రిల్ 14 (ప్రజా అమరావతి);
పేదరికం నుండి బయటపడటానికి చదువే ఏకైక మార్గం ...ఇదే భారత రాజ్యాంగ కర్త డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అందించిన స్ఫూర్తి....
............జిల్లా కలెక్టర్ . M. హరినారాయణన్
పేదరికం నుండి బయటపడి సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి చదువే ఏకైక మార్గమని జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ పేర్కొన్నారు
శుక్రవారం ఉదయం భారత రాజ్యాంగ ప్రధాత, భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి ని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తోలుత నగరంలోని వి ఆర్ సి సెంటర్లో డా బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం లో డా. బి .ఆర్. అంబేద్కర్ జయంతోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలాంకృతం చేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశం లోని ప్రజలందరూ ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతోనే అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారన్నారు. పేదరికంలో పుట్టినప్పటికి చదువనే ఆయుధంతో గొప్ప నేతగా ఎదిగిన మహామనిషి అంబేద్కర్ అని కలెక్టర్ పేర్కొన్నారు. పేదరికంలో పుట్టి కష్టాలను సైతం లెక్కచేయకుండా కేవలం భారతదేశం లోనే కాకుండా ఉన్నత చదువుల కోసం విదేశాలకు సైతం వెళ్లి చదువుకొని ఉన్నత స్థానానికి ఎదిగారాన్నారు.. వారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని నేటితరం విద్యార్ధిని, విద్యార్థులలో నింపాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతిఒక్కరూ తమ పిల్లలను చదివిస్తేనే వారి కుటుంబాలు ఆర్థికంగా పైకి వస్తాయన్నారు.విద్య ద్వారానే పేద కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమై సాధికారత సాధిస్తాయన్నారు. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యకు పెద్ద పీట వేసి విద్యారంగంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టి అమలు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాలయ్య, సుదర్శన్, సంయుక్త కలెక్టర్ రోణంకి కుర్మనాధ్, ట్రైని కలెక్టర్ విద్యాధరి, డి ఆర్ ఓ వెంకట నారాయణమ్మ, జిల్లా ఏస్సీ సంక్షేమ సాధికారిత అధికారి వెంకటయ్య, పి యం 15 సూత్రాల సెంట్రల్ కమిటీ సభ్యులు ఏలీషా, పి యం ఆదర్శ గ్రామీణ యోజన సెంట్రల్ కమిటీ సభ్యులు మురళి, రాష్ట్ర యానాదుల సంఘం అధ్యక్షులు పెంచలయ్య, నాయకులు విజయ్ కుమార్, ప్రసన్న, జయరాజు, సోమశేఖర్, సుబ్బారావు, చంద్రశేఖర్, వెంకయ్య, కేశవ రావు, ఆరవ రాయప్ప ఇంకా పలువురు sc,st నాయకులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment