విజయవాడ (ప్రజా అమరావతి);
ఏపీలో “గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్” – రేపు పునరుత్పాదక శక్తి మరియు మొబిలిటీ ప్రమోషన పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అగ్రగామిగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి మరియు మొబిలిటీ ప్రమోషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర శక్తి, అటవీ, పర్యావరణ, గనులు మరియు భూగర్భ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన 20/04/2023 (గురువారం) న మధ్యాహ్నం 2 గంటలకు భవానీపురం లోని AP Council of Science and Technology లో నిర్వహించే పునరుత్పాదక శక్తి మరియు మొబిలిటీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ సెంటర్ – ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ ను మంత్రి ప్రారంభిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
addComments
Post a Comment